Demonte Colony 2 Review and Rating in Telugu: డిమోంటి కాలనీ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2. తమిళనాట ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆగస్టు 23న విడుదలైంది. మరి తమిళ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
Demonte Colony 2 Review and Rating in Telugu: డిమోంటి కాలనీ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ 2. తమిళనాట ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆగస్టు 23న విడుదలైంది. మరి తమిళ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
nagidream
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, సర్జానో ఖలీద్, మీనాక్షి గోవిందరాజన్, అర్చనా రామచంద్రన్ నటీనటులుగా.. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో బి. సురేష్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన సినిమా డిమోంటి కాలనీ 2. డిమోంటి కాలనీ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఇది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ తమిళనాట మంచి టాక్ దక్కించుకుంది. మరి తెలుగులో కూడా అంతే మంచి టాక్ తెచ్చుకుందా? లేదా? రివ్యూలో చూద్దాం.
సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్) క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతుంటాడు. అలాంటి సామ్ ని డెబీ (ప్రియా భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సామ్ ని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేసి మామూలు మనిషిని చేస్తుంది డెబీ. అయితే ఉన్నట్టుండి సామ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. సామ్ ఆత్మహత్యకు కారణమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఒక పుస్తకం వల్లే చనిపోయాడని డెబీ తెలుసుకుంటుంది. అదే పుస్తకాన్ని చదివిన ట్విన్ బ్రదర్స్ శ్రీనివాస్, రఘునందన్ లు కూడా చనిపోతారని తెలుసుకుంటుంది డెబీ. ఈ వరుస చావులను ఆపాలని డెబీ ప్రయత్నిస్తుంది. మరి డెబీ ప్రయత్నాలు ఫలించాయా? అసలు పుస్తకం చదివితే ఎందుకు చనిపోతారు? ఆ దయ్యం కథ ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టైటిల్ కార్డ్స్ ద్వారా డిమోంటి కాలనీ మొదటి భాగం కథ ఏంటి అనేది చెప్పారు. ఇక ఈ రెండో భాగం కథను కూడా ఇంట్రస్టింగ్ గా స్టార్ట్ చేశాడు దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు. కథను మూడు చాప్టర్స్ గా విభజించి ఒక్కో చాప్టర్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ వచ్చాడు. మొదటి చాప్టర్ లో డెబీ భర్త సామ్ ఆత్మహత్య చేసుకోవడం, డెబీ బౌద్ధ సన్యాసుల సాయంతో సామ్ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేయడం వంటి సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. రెండో చాప్టర్ లో కవల సోదరుల కథతో డెబీ కథను ముడిపెట్టిన తీరు ఆసక్తి రేపుతోంది. శ్రీనివాస్ చావుతో రఘునందన్ మరణం ముడిపడి ఉన్నట్లు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది.
డెబీ, రఘునందన్ ల ప్రయాణంతో మూడో చాప్టర్ మరింత ఆసక్తిగా సాగుతుంది. ఇక డిమోంటి కాలనీ కోణం నుంచి సెకండ్ హాఫ్ ఇంట్రస్టింగ్ గా సాగుతుంది. ఎక్కడో హాస్టల్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిలు ఒక పుస్తకం చదివి డిమోంటి హౌజ్ లో ప్రత్యక్షమవుతారు. అక్కడ ఆ అమ్మాయిలు ఫేస్ చేసే అనుభవాలు ఉత్కంఠ రేపుతాయి. ఇక్కడ వరకూ చూపుతిప్పుకోనివ్వకుండా ఆసక్తికరంగా రాసుకున్న స్క్రీన్ ప్లే.. ఆ తర్వాత తడబడినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకూ ఈ కన్ఫ్యూజన్ అనేది సాగుతుంది. అయితే క్లైమాక్స్ సీన్లు ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డిమోంటి కాలనీ మూడో భాగం ఉంటుందని చెప్పారు.
డెబీ పాత్రలో ప్రియా భవానీ శంకర్, కవల సోదరులుగా శ్రీనివాస్, రఘునందన్ పాత్రల్లో అరుళ్ నిధి బాగా నటించారు. కవల సోదరుల ఇద్దరి పాత్రలకి వైవిద్యం చూపించారు. సెకండాఫ్ లో ప్రియా భవానీ శంకర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అరుణ్ పాండ్యన్, మీనాక్షి గోవిందరాజన్ తదితరుల నటన బాగుంది.
ఫస్ట్ హాఫ్ ని ఆద్యంతం ఉత్కంఠ కలిగేలా నడిపిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సెకండాఫ్ కి వచ్చేసరికి కన్ఫ్యూజన్ కి గురైనట్లు ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నేపథ్య సంగీతం బాగున్నాయి.