Bhimaa Movie Review & Rating In Telugu: మ్యాచో మ్యాన్ గోపీచంద్ మహా శివరాత్రి రోజు భీమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో హిట్టు కొట్టాడా? అసలు భీమా సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Bhimaa Movie Review & Rating In Telugu: మ్యాచో మ్యాన్ గోపీచంద్ మహా శివరాత్రి రోజు భీమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో హిట్టు కొట్టాడా? అసలు భీమా సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
మ్యాచో స్టార్ గోపీచంద్ కెరీర్లో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి కెరీర్ ని హిట్టుల బాట పట్టించడానికి తనకి బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ ని ఎచుకున్నాడు. ఆంధ్రుడు, శౌర్యం, గోలీమార్ సినిమాలో గోపీచంద్ పోలీసుగా చేశాడు. ఆ మూవీస్ మంచి సక్సెస్ కూడా అయ్యాయి. ఇప్పుడు ఈ భీమా సినిమా కూడా పోలీసు క్యారెక్టరే కావడం, పైగా ఇందులో సోషియో ఫాంటరీ ఎలిమెంట్ కూడా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. మరి.. గోపీచంద్ కెరీర్లో సక్స్ ట్రాక్ లోకి వచ్చాడా? కన్నడ దర్శకుడు హర్ష.. గోపీచంద్ కి బ్లాక్ బస్టర్ అదించాడా? అసలు భీమా సినిమా ఎలా ఉంది? తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
మహేంద్రగిరి ఊరిలో భవాని(ముఖేష్ తివారి) ఎదురులేని శక్తిగా ఉంటాడు. అతడిని ప్రశ్నిస్తే ఎంతటి వారినైనా వదలడు. ప్రభుత్వ అధికారులు అయినా అతనికి లెక్కలేదు. చెక్ పోస్ట్ దగ్గర అతని లారీల జోలికి వెళ్తే పోలీసులు అయినా కనికరం చూపించడు. తన లారీల జోలికి వచ్చాడు అని.. ఒక ఎస్సైని కూడా చంపేస్తాడు. ఆ చనిపోయిన ఎస్సై స్థానంలోకి భీమా(గోపీచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతోనే భవానీతో పెట్టుకుంటాడు. అతనికి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇస్తాడు. అక్కడితో ఆగకుండా చెక్ పోస్ట్ దగ్గర భవానీ లారీల జోలికి కూడా వెళ్తాడు.
భీమాని ఎదిరించడానికి భవానీ తన బలగాన్ని మహేంద్రగిరిలో దించాక ఏం జరిగింది? అసలు భవానీ లారీల్లో ఏం ఉంది? ఈ సినిమాలో చాలానే పాత్రలు ఉంటాయి. ప్రకృతి వైద్యుడు రవీంద్ర వర్మ(నాజర్) ఎవరు? పారిజాతం(ప్రియా భవానీ శంకర్) ఎవరు? విద్య(మాళవికా శర్మ) వల్ల గోపీచంద్ లైఫ్ ఎలా మారింది? మహేంద్రగిరిలోని పరుశురామ క్ష్రేత్రంలో ఉన్న శివాలయం 5 దశాబ్దాలుగా ఎందుకు మూతబడి ఉంది? దానితో వీళ్లందరికి ఏంటి సంబంధం? ఇలాంటి చాలానే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే భీమా సినిమా చూడాల్సిందే.
ఇప్పటివరకు మీరు గోపిచంద్ ని పోలీస్ పాత్రలో చాలాసార్లు చూశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా కనిపిస్తాడు. గోపిచంద్ పాత్రను హర్ష చాలా కొత్తగా డిజైన్ చేశారు. అంతేకాకుండా సినిమా కథ కూడా కొత్తగానే ఉంటుంది. పోలీసు క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథలో సోషలియో ఫాంటసీ ఎలిమెంట్ ని యాడ్ చేయడం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కథను కూడా అంతే గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. సినిమా స్టార్టింగ్ లో 15 నిమిషాలపాటు పరశురామ క్షేత్రం గురించి ఆ గుడి గురించి చూపిస్తారు. ఆ 15 నిమిషాలు ఆడియన్స్ వేరే లోకంలోకి వెళ్లిపోతారు. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది.
హీరో వచ్చిన తర్వాత మాత్రం సినిమా కాస్త కమర్షియల్ హంగులు ఎక్కువ అద్దుకున్నట్లు కనిపిస్తుంది. హీరో ఎలివేషన్, ఎస్టాబ్లిష్మెంట్ షాట్స్ కాస్త రొటీన్ సినిమా చూస్తున్నాం అనే భావన కలిగిస్తాయి. కానీ, ఎక్కడా కూడా అంచనాలను తగ్గించదు. ఇందులో రెండు లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. పోలీసుగా భీమాకి విద్యాని ప్రియురాలిగా పెడతారు. అలాగే రామా క్యారెక్టర్ కి పారిజాతం ప్రేయసిగా ఉంటుంది. ఈ రెండు లవ్ స్టోరీస్, కొన్ని కామెడీ సీన్స్ మాత్రం కొంచం రొటీన్ గా అనిపిస్తాయి. వీటిపై డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండేది అనిపిస్తుంది.
ఈ మూవీ సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ అని చెప్పిన తర్వాత రొటీన్ ఎలివేషన్స్, లవ్ స్టోరీలు చూడాలి అంటే ఆడియన్స్ కాస్త నిరుత్సాహ పడే అవకాశం ఉంటుంది. అదే భీమాకి ఉన్న మైనస్ గా చెప్పచ్చు. ఈ మూవీ మొత్తం హీరో పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కానీ, హీరో ఒక్కడే ప్రధానం అనడానికి లేదు. అన్ని పాత్రలకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది. మొత్తానికి సినిమా మొత్తాన్ని కొత్తగానే తీశారు. కానీ, అక్కడక్కడ రొటీన్ ఫ్లేవర్ ఉంటుంది. ఆఖరి 30 నిమిషాలు మాత్రం ఆడియన్స్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ సీక్వెన్స్ మొత్తం నెక్ట్స్ లెవల్ ఎక్స్ పీరియన్స ఇస్తుంది. సినిమా మొత్తానికి అదే సోల్ అని చెప్పచ్చు.
ఈ మూవీ కోసం గోపిచంద్ తన 100 శాతం ఎఫర్ట్స్ పెట్టేశాడు. అన్ని సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో ఇంకా స్టైలిష్ గా ఉన్నాడు. పోలీసు పాత్రలో గోపిచంద్ ఏ స్థాయిలో నటించగలడో అందరికీ తెలుసు. అందరూ ఊహించిన దాని కంటే కాస్త ఎక్కువగానే ఎఫర్ట్స్ కనిపిస్తాయి. రామాగా కూడా డిఫరెన్స్, సెపరేట్ మేనరిజంతో ఆకట్టుకున్నాడు. మాళవికా శర్మకు మంచి పాత్ర దొరికింది. అలాగే ఆమెకు తగిన స్క్రీన్ స్పేస్ కూడా లభించింది. ఇంక ముఖేష్ తివారి చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఒక మంచి పాత్రతో ప్రేక్షకులను అలరించాడు. ఇంక చాలానే పాత్రలు ఉన్నాయి. నాజర్, నరేశ్, రఘుబాబు, వెన్నెల కిషోర్, సప్తగిరి, సరయు, చమ్మక్ చంద్ర, భద్రం వంటి కమెడియన్స్ ఉన్నారు. వీళ్లందరు బాగానే నవ్విస్తారు. అయితే సీనియర్ నరేశ్ కు మాత్రం మంచి స్పేస్ లభించింది.
ఇంక టెక్నికల్ విభాగం విషయానికి వస్తే.. డైరెక్టర్ హర్ష ఆడియన్స్ ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. కానీ, ఆ కొత్త ప్రపంచాన్ని ఎక్కువగా చూపించలేదు అనే నిరాశ ఉంటుంది. డైరెక్టర్ గా ఈ సినిమాకి మంచి న్యాయం చేశాడు. అలాగే రవి బస్రూర్ మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సినిమాల్లో ఇతను కొట్టే మ్యూజిక్ కు మ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో రవి బస్రూర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎంతో మెప్పిస్తుంటుంది. అయితే పాటలకు సంబంధించి మాత్రం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంక సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మూవీని స్వామి జె గౌడ ఛాయాగ్రహణం నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి. పెట్టిన ప్రతి రూపాయి మీకు ఎండ్ రిజల్ట్ చూపిస్తుంది.
చివరిగా: ఎక్స్ పెక్టేషన్స్ వద్దు.. ఈ భీమా నచ్చేస్తాడు..
రేటింగ్: 2.5/5