Telugu Web Series Bench Life OTT Review: ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ లు సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ 'బెంచ్ లైఫ్' స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Telugu Web Series Bench Life OTT Review: ఈ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు , సిరీస్ లు సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ 'బెంచ్ లైఫ్' స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
Swetha
డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు, సిరీస్ ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. అందులోను తెలుగు కంటెంట్ మరింత ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సిరీస్ మరేదో కాదు నిహారిక కొణిదెల రూపొందించిన ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్. కమిటీ కుర్రాళ్ళు మూవీ సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత.. అదే ఊపులో ఈ సిరీస్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సిరీస్ ప్రస్తుతం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ప్రేక్షకులంతా వెబ్ సిరీస్ లను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు కాబట్టి.. ఈ సిరీస్ ను కూడా అదే విధంగా ఆదరించే అవకాశం లేకపోలేదు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
ఈ మూవీ కథ అంతా కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బాలు(వైభవ్ రెడ్డి) , మీనాక్షి(రితికా సింగ్) , రవి(చరణ్ పెరి) ఈ ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఐటీ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఉద్యోగులను బెంచ్ లో ఉంచుతారు. దీనితో బాలుకి ఉద్యోగం చేయడం కంటే.. బెంచ్ లో ఉండి కొన్నాళ్లుగా ప్రేమిస్తున్న ఈషా(ఆకాంక్ష సింగ్) కు తన ప్రేమను చెప్పి పెళ్లి చేసుకోవడం ఇష్టం. ఇక మీనాక్షికి బెంచ్ లో ఉండి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ.. డైరెక్టర్ అవ్వాలని కళ. అలాగే రవికి బెంచ్ లో ఉన్నప్పుడు హ్యాపీగా గోవా వెళ్లాలని ఆశ. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఆఫీస్ మేనేజ్మెంట్ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు. అసలు ఈ బెంచ్ లో ఉండడం కోసం వారు ఏం చేశారు ? బెంచ్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ? మీనాక్షి తాను అనుకున్నట్లు డైరెక్టర్ అయిందా ? రవి గోవా ప్లాన్, బాలు లవ్ ప్రొపోజల్ ఏం అయ్యాయి ? వారి నిర్ణయాల కారణంగా వారి కెరీర్ కు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా ? చివరలో ఏమైంది ? అనేదే ఈ సిరీస్ కథ.
బెంచ్ లైఫ్ అనే పదం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే బాగా అలవాటైన పదం. నార్మల్ ఆడియన్స్ కు ఈ వర్డ్ అంతగా తెలియక పోవచ్చు. కాబట్టి సిరీస్ స్టార్టింగ్ లోనే అసలు బెంచ్ లైఫ్ అంటే ఏంటో చూపించేశారు. ఇక సిరీస్ మొత్తం కూడా అంతే సింపుల్ గా కొనసాగుతూ ఉంటుంది. సిరీస్ లో పెద్దగా బుర్రకు పదును పెట్టి ఆలోచించేంత ట్విస్ట్ లు , మలుపులు ఏమి ఉండవు. సింపుల్ గా చెప్పాలంటే.. ఆఫీస్ లో పని నుంచి తప్పించుకుని .. హ్యాపీగా తమకు నచ్చినట్లు ఎంజాయ్ చేయాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కథ ఇది. ఈ ముగ్గురి క్యారెక్టర్స్ లో ప్రతి క్యారెక్టర్ కూడా యూత్ లో ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంది.
కథ , కథనంలో కొత్తదనం లేదు కానీ.. రెగ్యులర్ గా అందరి లైఫ్ లో జరిగే సన్నివేశాలే కాబట్టి బాగానే మెప్పించాయి. ఇక బాలు ఈషాను ఎందుకు ప్రేమించాడు ? ఈషా బాలుని ప్రేమించిందా లేదా ? ఈషా గతం ఏంటి ? ఇవన్నీ డెప్త్ గా చూపించలేదు. దీనితో ఈ సీన్స్ లో ఆడియన్స్ సిరీస్ లోని ఎమోషన్ ను మిస్ అవుతారు. ఇక చరణ్ , నయన్ కథలైతే ప్రేక్షకులను బాగా మెప్పిస్తాయి. సిరీస్ మొత్తం లో వైభవ్ నటన వలన అన్ని సీన్స్ లో ప్రేక్షకులు నవ్వేస్తారు. ముఖ్యంగా ప్రతి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ఈ సిరీస్ కు బాగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ వీకెండ్ ఓ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ చూడాలంటే మాత్రం .. బెంచ్ లైఫ్ బెస్ట్ ఛాయిస్.
వైభవ్ రెడ్డిని తెలుగు సిరీస్ లో చూడడం విశేషం. సిరీస్ మొత్తంలో ఎక్కడా కూడా తన క్యారక్టర్ నుంచి బయటకు రాకుండా.. చాలా నేర్పుగా వ్యవహరించారు. ఈ క్యారెక్టర్ మాత్రం కచ్చితంగా చాలా మందికి రిలేట్ అవుతుంది. ఇక బాలు మాటలకు, జోక్స్ అంత కనెక్ట్ అవుతారు కానీ.. క్యారెక్టర్ కు మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేరు. అలాగే రితికా సింగ్ పాత్ర అందరిని ఇంప్రెస్ చేస్తుంది కానీ.. తన క్యారెక్టర్ డబ్బింగ్ మాత్రం మైనస్ అయింది. ఇక వీరితో పాటు.. నయన్ సారిక ,ఆకాంక్ష సింగ్.. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, తనికెళ్లభరణి లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
దర్శకురాలు ఈ కథను ప్రతి సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కనెక్ట్ అయ్యేలా కథను రాసుకున్న తీరును మెచ్చుకోవాలి. అన్నిటిలో ముఖ్యంగా చరణ్ పెరి-నయన్ సారిక జంటకు ఇచ్చిన ఎండింగ్ బావుంది. న్యాచురల్ గా కథను తెర మీద చూపించడంలో అక్కడక్కడా కాస్త తడబడ్డారని చెప్పాలి. మొత్తం మీద కథను అందించడంలోను , డైరెక్ట్ చేయడంలోనూ మానస శర్మ మంచి మార్కులు కొట్టేశారు. సినిమాటోగ్రఫీ వర్క్, నేపథ్య సంగీతం, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి కూడా.. సరైన రీతిలోనే ఉన్నాయి.
చివరిగా : హ్యూమర్,ఎమోషన్స్ ఉన్న డీసెంట్ వెబ్ సిరీస్ ‘బెంచ్ లైఫ్’
రేటింగ్ : 2.5/5