Anya's Tutorial OTT Review: రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఆన్యాస్ ట్యూటోరియల్ వెబ్ సిరీస్ ఆహాలో విడుదలైన విషయం తెలిసిందే. మరి.. ఆ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
Anya's Tutorial OTT Review: రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఆన్యాస్ ట్యూటోరియల్ వెబ్ సిరీస్ ఆహాలో విడుదలైన విషయం తెలిసిందే. మరి.. ఆ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.
iDreamPost
ఈ మధ్యకాలంలో సినిమాల మీద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం కంటే అందులో సగం కన్నా తక్కువ ఖర్చుతో వెబ్ సిరీస్ లు తీయడం మంచిదనే అభిప్రాయానికి ఓటిటిలు వస్తున్నాయి. అందులో భాగంగానే వెరైటీ కాన్సెప్ట్స్ తో పేరున్న ఆర్టిస్టులను తీసుకుని వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆహా(AHA) గత కొంత కాలంగా వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా వచ్చిందే అన్యస్ ట్యుటోరియల్(Anya’s Tutorial Web Series). టైటిల్ చూసి ఇదేదో పిల్లలకు సంబంధించినది అనుకుంటారేమో. ఈ పాఠాలు పక్కా హారర్ జానర్ లో రూపొందాయి. ఇంకా చెప్పాలంటే కిడ్స్ కి రికమండ్ చేసేది కూడా కాదు. మరి ఇందులో ఏముందో రిపోర్ట్ లో చూసేద్దాం.
అన్య(నివేదిత సతీష్)ఒంటరిగా ఎవరూ లేని ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే ఉంటుంది. కారణం చిన్నతనంలో అక్క మధు(రెజినా)చేసిన పనివల్ల ఆమె మీద ద్వేషం ఏర్పడటం. ఇన్స్ టా గ్రామ్ లో వీడియోల ద్వారా ట్యుటోరియల్ చెప్పే అన్యకు తానుండే ఇంట్లో దెయ్యం ఉందని ఆలస్యంగా తెలుసుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎవరెవరో పరిచయమవుతారు. ఫాలోయర్స్ తగ్గడం పెరగడం జరుగుతుంది. పోలీసులు ట్రై చేసినా అన్య అడ్రెస్ తెలుసుకోలేకపోతారు. ఈలోగా కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని కొందరు యువతీ యువకులు అన్య వల్ల చనిపోతారు. అదేంటో కనుక్కోవడమే ఈ ట్యుటోరియల్ కాన్సెప్ట్
దర్శకురాలు పల్లవి గంగిరెడ్డి హాలీవుడ్ మూవీ నుంచి కొంత స్ఫూర్తి తీసుకున్నప్పటికీ దీన్ని హారర్ ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కు తగట్టు టోన్ ని స్క్రీన్ ప్లేని సెట్ చేసుకోవడం వల్ల దెయ్యాల కథలు ఇష్టపడేవాళ్ళను అన్యస్ ట్యుటోరియల్స్ బాగానే మెప్పిస్తుంది. సిరీస్ కాబట్టి మధ్యలో కొంత సాగతీత ఉన్నప్పటికీ ఫైనల్ గా ఇచ్చిన ట్విస్టుల వల్ల మిగిలే సంతృప్తి ఎక్కువ. షాకులు కూడా బాగానే ఉన్నాయి. దెయ్యం రివీల్ అయ్యాక ల్యాగ్ వచ్చింది కానీ చేతిలో ఫార్వార్డ్ ఆప్షన్ ఉండటం వల్ల బోర్ తగ్గుతుంది. రెజీనాలాంటీ(Regina) సీనియర్ ఉన్నా నివేదిత సతీష్(Nivedhithaa) పూర్తిగా డామినేట్ చేసింది. అర్రోల్ కొరెల్లి నేపధ్య సంగీతం పర్ఫెక్ట్ గా కుదిరింది. కొన్ని డిస్టర్బ్ చేసే విజువల్స్ ఉన్నాయి. మొత్తం మూడు గంటలకు పైగా నిడివి ఉన్న ఈ ట్యుటోరియల్స్ ని కొంత డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు.