Sasi Madhanam Web Series Review And Rating: రియల్ జోడీ సోనియా సింగ్- పవన్ సిద్ధు శశి మథనం వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. మరి.. ఆ శశి మథనం వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Sasi Madhanam Web Series Review And Rating: రియల్ జోడీ సోనియా సింగ్- పవన్ సిద్ధు శశి మథనం వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. మరి.. ఆ శశి మథనం వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.
Tirupathi Rao
సోనియా సింగ్- పవన్ సిద్ధుల జోడీ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యే నెటిజన్స్, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రియల్ జంట.. అటు రీల్ లో కూడా ఇప్పటికే పలుసార్లు మెప్పించింది. ఇప్పుడు మరోసారి రీల్ జోడీగా లీడ్ రోల్స్ ప్లే చేశారు. శశి మథనం వెబ్ సిరీస్ తో పవన్ సిద్ధు- సోనియా సింగ్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇప్పటి వరకు సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తూ వచ్చిన ఆడియన్స్ ఒక్కసారిగా క్యూట్ లవ్ స్టోరీ రాగానే ఎగబడి చూసేస్తున్నారు. మరి.. అది నిజంగానే క్యూట్ గా ఉందా? సోనియా సింగ్- పవన్ సిద్ధు మెప్పించారా? అసలు శశి మథనం వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
మదన్(పవన్ సిద్ధు) అన్నయ్య వాళ్లతో ఊర్లో ఉంటూ ఉంటాడు. ఎలాగైనా రాత్రికి రాత్రే లక్షలు సంపాదించేయాలి అనే మెంటాలిటీ కలిగిన వ్యక్తి. బలాదూర్ తిరగడమే కాకుండా.. డబ్బు సంపాదించాలని పేకాట ఆడటం, బెట్టింగులు పెట్టడం చేస్తుంటాడు. అలా బెట్టింగ్ భాస్కర్ కు అప్పు పడతాడు. అప్పు సొమ్ము కోసం భాస్కర్ ఏదైనా చేసే రకం అని ముందుగానే తన అన్న బండిని భాస్కర్ దగ్గర పెట్టేస్తాడు. డబ్బులిచ్చి ఆ బండి తీసుకెళ్తాను అంటూ చెప్పుకొస్తాడు. అతని భారి నుంచి తప్పించుకునేందుకు కొన్నిరోజులు ఎక్కడైనా తలదాచుకోవాలి అనుకుంటాడు. అలా తన ప్రియురాలు శశి(సోనియా సింగ్) ఇంటికి వెళ్తాడు. అప్పుడే వాళ్ల పేరెంట్స్ కూడా పెళ్లికని వెళ్తారు. పది రోజులు ఎవరూ ఉండరని తెగ సంబరపడిపోతారు. కానీ, పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని తిరిగి వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చిన పేరెంట్స్, కుటుంబ సభ్యులకు తెలియకుండా మదన్ ని శశి ఎలా దాచింది? ఇంట్లో ఎవరి కంట పడకుండా దాచడం సాధ్యమేనా? అసలు బెట్టింగ్ భాస్కర్.. మదన్ ను వదిలేశాడా? మదన్ అప్పు తిరిగి కట్టాడా? అన్నయ్య బండి పరిస్థితి ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈటీవీ విన్ లో ఈ శశి మథనం సిరీస్ చూడాల్సిందే.
ఈ శశి మథనం సిరీస్ కథ పరంగా రొటీన్ గానే అనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులకు తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ని ఇంట్లో దాచడం మనం ఇప్పటికే చాలాసార్లు చూశాం. కాకపోతే ఇందులో కాస్త ఎక్కువ రోజులు దాచారు. కథ రొటీన్ అయినా డైరెక్టర్ రాసుకున్న తీరు, హ్యాండిల్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథలోకి వెళ్లేందుకు తొలి ఎపిసోడ్లో కాస్త సమయం ఎక్కువ తీసుకున్నట్లు అనిపించింది. అక్కడ కాస్త ల్యాగ్ ఫీలవుతారు. అయితే ఎవరి కంట పడకుండా ప్రియుడిని దాచిన తీరు నవ్వించడమే కాకుండా.. మెప్పిస్తుంది కూడా. హీరో- హీరోయిన్ మధ్య రొమ్యాన్స్ మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఇంకాస్త కామెడీ టచ్ ఉంటే బాగుండు అనే ఫీలిగ్ అయితే కలగక మానదు. కథ పరంగా కాస్త రొటీన్ గా ఉంది అనే భావన మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది.
ఎవరి కంటపడకూడదు అని మదన్ పడే కష్టాలు కితకితలు పెడతాయి. ఇంట్లో దెయ్యం ఉంది అనుకుని అంతా కంగారు పడే సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే సోనియా సింగ్- పవన్ సిద్ధుల జోడీ ఎప్పటిలాగానే సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఈ సిరీస్ లో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ తమ పాత్రకు న్యాయం చేశారు. ముఖ్యంగా శశి తండ్రిగా చేసిన ప్రదీప్ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాడు. అలాగే తాత పాత్రలో చేసిన అశోక్ చంద్ర కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాడు. మిగిలిన అందరు నటీనటులు వారి పాత్ర మేరకు మెప్పిస్తారు. ఈ సిరీస్ లో ప్రథమంగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. ప్రతి సీన్ లో ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ, ఉన్న రెండు పాటలు కచ్చితంగా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ తన టేకింగ్, స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో వచ్చినా కూడా.. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.
రేటింగ్: 2.5/5