OTT Suggestions- Police Story Night Owls Movie: సినిమాలు చూసి హత్య.. OTTలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్!

సినిమాలు చూసి హత్య.. OTTలో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్!

OTT Suggestions- Best Investigation Movie In OTT: ఓటీటీల్లో చాలానే ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఉంటాయి. కానీ, అన్నీ అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. కానీ, ఈ మూవీ మాత్రం చూడటానికి చాలా చిన్న సినిమాలా ఉంటుంది. కానీ, స్టార్ట్ చేస్తే మాత్రం ఆపలేరు.

OTT Suggestions- Best Investigation Movie In OTT: ఓటీటీల్లో చాలానే ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఉంటాయి. కానీ, అన్నీ అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. కానీ, ఈ మూవీ మాత్రం చూడటానికి చాలా చిన్న సినిమాలా ఉంటుంది. కానీ, స్టార్ట్ చేస్తే మాత్రం ఆపలేరు.

సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్స్ వేరయా అని ఊరికే అనలేదు. ఈ థ్రిల్లర్ చూస్తుంటే మనల్ని మనమే మర్చిపోతాం. అసలు అక్కడ ఏం జరుగుతోందో మనమే ముందే తెగ ఆలోచిస్తాం. ఇంక అది మర్డర్ మిస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే.. అదేదో ఆ కేసును మనమే ఛేదిస్తున్నాం అనే ఫీల్ ఉంటది. మరి.. ఆ రేంజ్ ఫీల్ కావాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇందులో ఓ రేంజ్ ట్విస్టులు, మలుపులు, యూ టర్నులు అబ్బో ఒకటేమిటి.. ఘాట్ రోడ్డులో గాడీ తోలుతున్నప్పుడు వచ్చే ఫీల్ వస్తది. మరి.. ఆ సినిమా ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అసలు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఈ సినిమా ఒక హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ లో జరిగిన హత్య. అసలు ఆ హత్య చేసింది ఎవరు? అనే పాయింట్ మీద ఈ సినిమా మొత్తం నడుస్తూ ఉంటుంది. అయితే అంత సింపుల్ గా కేసు ఛేదిస్తే సినిమా ఎలా నడుస్తుంది చెప్పండి. అందుకే ఆ హత్య చుట్టూ మొత్తం కథని నడిపిస్తారు. ఈ కేసు కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా అపాయింట్ చేస్తారు. అంటే ఇది అలాంటి ఇలాంటి కేసు కాదు అని అర్థమైపోతుంది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా సింపుల్ కథ అనిపిస్తుంది. చూడటానికి కూడా అలాగే ఉంటుంది. కానీ, కథలోకి వెళ్లేకొద్దీ సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా మారుతుంది.

ఆ పోలీసు ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అడుగడునా అడ్డంకులే వస్తూ ఉంటాయి. ఒక్క క్లూ కూడా లేకుండా అసలు ఎలా హత్య చేశారో అర్థం కాదు. మర్డర్ వెపన్ దొరికినా కూడా హంతకుడిని పట్టుకోలేని పరిస్థితి. అలా ఎందుకు జరిగింది అంటే అది పక్కాగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్ కాబట్టి. హంతకుడు అక్కడున్న ఉద్యోగి కూడా కావచ్చు. కానీ, ఎక్కడా అందుకు సాక్షాలు ఉండవు. అక్కడి ఎంప్లాయిస్ అంతా క్రైమ్ నవల్స్ చదువుతూ, న్యూస్, సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూ ఉంటారు. అంటే వారికి దొరకకుండా హత్య చేయడం ఎలా అనేది తెలిసే ఉంటుంది. మరి.. ఆ హత్య చేసింది ఎవరు? అసలు అతడిని చంపితే ఎవరికి లాభం? పోలీసులు హత్యను ఛేదించారా లేదా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఈ పోలీస్ స్టోరీ- కేస్ 1: నైట్ అవుల్స్ సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. మీరు ఇప్పటికే ఈ మూవీ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments