OTT Suggestions-Crime Investigation Thriller : ఒక డెడ్ బాడీ గిఫ్ట్ గా వస్తే! OTT లో ఊహకందని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

ఒక డెడ్ బాడీ గిఫ్ట్ గా వస్తే! OTT లో ఊహకందని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్

OTT Best Crime Investigation Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఒకలానే అనిపిస్తూ ఉంటాయి. కానీ పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది.. ఆ సినిమాలలో ఉండే మ్యాజిక్ ఏంటి అనేది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Crime Investigation Thriller : మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నీ కూడా ఒకలానే అనిపిస్తూ ఉంటాయి. కానీ పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది.. ఆ సినిమాలలో ఉండే మ్యాజిక్ ఏంటి అనేది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీనే. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు వస్తున్నా కూడా ఇంకా కొత్త సినిమాల కోసం.. కొత్త కంటెంట్ కోసం చూస్తూనే ఉంటారు ప్రేక్షకులు . ఈ క్రమంలో ఆల్రెడీ ఓటీటీ లో ఉండే కొన్ని సినిమాలను మిస్ చేసేస్తున్నారు. వారికోసమే ఇలాంటి మూవీ సజ్జెషన్. అయితే ఈ మధ్య అందరి ఫోకస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలే మీదే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. కానీ సినిమా చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఆ సినిమాలో ఉండే మ్యాజిక్ ఏంటి అనేది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ సినిమా క్లైమాక్స్ అయితే కాస్త కొత్తగా ఉంటుంది. మరి ఈ సినిమా ఎంటి ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. భీమ్ సేన్ అనే ఒక దొంగ ఓ ఇంట్లో దొంగతానానికి వెళ్తాడు . ఆ ఇంట్లో ఒక బాగ్ దొంగతనం చేసి.. ఆ ఇంట్లో ఎదో చూసి భయపడి పోయి వెంటనే గోడ దూకి పారిపోతాడు. అలా భీమ్ సేన్ పారిపోతూ ఉండగా పోలీసులు దానిని గమనించి అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అలా అశోక్ అనే పోలీస్ ఆఫీసర్ భీమ్ సేన్ ను పట్టుకుంటాడు. వెంటనే భీమ్ సేన్ ను దొంగతనం చేసిన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఆ ఇంట్లో సాక్షి అనీష్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వారు డ్రగ్స్ తీసుకోవడం వలన గాఢనిద్రలో ఉంటారు. ఇక భీమ్ సేన్ వెంటనే అక్కడ ఓ డెడ్ బాడీ ఉందని.. ఆ ఇంట్లో ఉన్న వారిద్దరూ ఎవరినో చంపేశారని మొత్తం చెప్తాడు. దీనితో పోలీసులు అంతా చెక్ చేసి.. సాక్షి, అనీష్ నిద్ర లేచే వరకు వెయిట్ చేస్తారు. వారు లేచాకా వారిని అసలేం జరిగిందో నిజం చెప్పండి అంటూ వారిని బెదిరిస్తారు.

కట్ చేస్తే.. సాక్షి , అనీష్ ల గతాన్ని చూపిస్తారు. భీమ్ సేన్ ఒక ఆటో డ్రైవర్ , సాక్షి మూవీస్ లో ఛాన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అనీష్ కూడా అదే ప్రయత్నాలలో ఉంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అనీష్ కు ఆడిషన్స్ కు రమ్మని కాల్ వస్తుంది. ఆ కాల్ లో మానస అనే అమ్మాయి ఒక అడ్రస్ చెప్పి.. అక్కడకు రమ్మంటుంది. అక్కడ కప్ బోర్డ్ ఓపెన్ చేయమని మానస చెప్తుంది. అనీష్ అలాగే చేస్తాడు. అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. మీకు డెడ్ బాడీ గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఓ ప్రత్యేక్ష సాక్షి నిన్ను గమనిస్తూనే ఉన్నారని చెప్తుంది. సరిగ్గా అప్పుడే సాక్షి కూడా ఆడిషన్స్ కు వస్తుంది. దింతో అనీష్ సాక్షిని ఈ కేసులో ఇరికించాలని అనుకుంటాడు. మానస అనీష్ కు కాల్ చేసి.. ఆ డెడ్ బాడీని ఎలాగైనా మాయం చేయాలనీ.. లేదంటే మీరే ఆ హత్య చేసినట్లు పోలీసులకు చెప్తానని బెదిరిస్తుంది. అసలు ఈ మానస ఎవరు ? డెడ్ బాడీని ఎందుకు గిఫ్ట్ గా ఇస్తుంది ? అసలు ఆ డెడ్ బాడీ ఎవరిదీ ? ఆ మర్డర్ చేసింది ఎవరు ? అనీష్, సాక్షి ఈ కేసులో నుంచి బయటపడ్డారా లేదా? ఇవన్నీ తెలియాలంటే “అరిషడ్వర్గ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments