OTT Suggestions - Horror Web Series: OTTలో భయపెట్టి మతి పోగొట్టే హర్రర్ వెబ్ సిరీస్.. ఒక్కరే చూసే ధైర్యం ఉందా!

OTTలో భయపెట్టి మతి పోగొట్టే హర్రర్ వెబ్ సిరీస్.. ఒక్కరే చూసే ధైర్యం ఉందా!

OTT Best Horror Web Series: వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే కనుక.. ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సిరీస్ చూసేటప్పుడు కాస్త కన్ఫ్యుజింగ్ గా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూస్తే మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి.. ఈ సిరీస్ ను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి .

OTT Best Horror Web Series: వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే కనుక.. ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సిరీస్ చూసేటప్పుడు కాస్త కన్ఫ్యుజింగ్ గా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూస్తే మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి.. ఈ సిరీస్ ను మీరు చూశారా లేదా ఓ లుక్ వేసేయండి .

వెబ్ సిరీస్ లను ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందులోను హర్రర్ సిరీస్ లంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఒక మూవీ మొత్తంలో ఉండే ట్విస్ట్ లన్నీ కూడా ఓ సిరీస్ లోని ఎపిసోడ్స్ లోనే ఉన్నంత ఫీల్ కలుగుతుంది. ఇక అలా ఓ వెబ్ సిరీస్ లో చాలా ఎపిసోడ్స్ ఉంటూ ఉంటాయి. వెబ్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే కనుక.. ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి రెండు సీసన్స్ ఉన్నాయి. అయితే ఈ సిరీస్ చూసేటప్పుడు కాస్త కన్ఫ్యుజింగ్ గా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూస్తే మాత్రం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? ఈ సిరీస్ ను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే .. యు , ఒలీవియా భార్య భర్తలు .. వీరికి ఐదుగురు పిల్లలు ఉంటారు. 25 ఏళ్ళ క్రితం ఈ ఫ్యామిలీ ఒక హాంటెడ్ హౌస్ కు వెళ్తారు. అప్పటికి వాళ్లకు అది హాంటెడ్ హౌస్ అని తెలియదు. అక్కడ ఓ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ వలన వాళ్ళ జీవితాలు తారు మారు అవుతాయి. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలకు వారంతా కూడా ఆ ఇంటి నుంచి పారిపోతారు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం అదే ఇంట్లో చనిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అంతా మారిపోయింది. ఆ పిల్లలలో ఒకడైన స్టీవెన్.. తన చిన్నప్పుడు హాంటెడ్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలను ఒక బుక్ గా రాస్తాడు. ఆ బుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ తన సిబ్లింగ్స్ కు మాత్రం ఇలా రాయడం నచ్చదు. ఇక వాళ్లలో ఒక అతను చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ను మర్చిపోలేక.. డ్రగ్ ఎడిక్ట్ అవుతాడు. అలా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు.

కట్ చేస్తే.. వారిలో నల్ అనే అమ్మాయి.. హాంటెడ్ హౌస్ దగ్గరకు వెళ్తుంది. ఫ్యామిలీ లో ఎవరికీ కాల్ చేసినా కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక కొద్దీ సేపటికి స్టీవెన్ కు ఓ కాల్ వస్తుంది.. నల్ చనిపోయినట్లు. స్టీవెన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. స్టీవెన్ హర్రర్ స్టోరీ బుక్స్ అయితే రాస్తాడు కానీ.. దెయ్యాల మీద అంత నమ్మకం ఉండదు. ఇప్పుడు తన సిబ్లింగ్ చనిపోవడంతో.. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతాడు. ఇలా కథ గతాన్ని , ప్రస్తుతాన్ని చూపిస్తూ ముందుకు తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే.. నల్ వాళ్ళ సిస్టర్ తన ఫ్యునెరల్ ని జరిపిస్తూ ఉండగా.. సడెన్ గా ఆమెలో వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది ? అసలు ఆ హాంటెడ్ హౌస్ లో ఏముంది ? ఈ సిబ్లింగ్స్ అంతా కలిసి ఏం చేద్దాం అనుకున్నారు ? 25 ఏళ్ళ క్రితం హాంటెడ్ హౌస్ లో ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది. ఇవన్నీ తెలియాలంటే.. “ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్” అనే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments