OTT Suggestions- Best Horror Movie: కొడుకు అనుకుంటే రాక్షసుడు పుడతాడు.. OTTలో వణికించే మూవీ!

కొడుకు అనుకుంటే రాక్షసుడు పుడతాడు.. OTTలో వణికించే మూవీ!

OTT Best Horror Movie: హర్రర్ సినిమాలు భయపెట్టినా సరే.. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్స్ తో సినిమా మొత్తం చూసేలా చేస్తాయి. ఇక ఇప్పడు చెప్పుకోబోయే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

OTT Best Horror Movie: హర్రర్ సినిమాలు భయపెట్టినా సరే.. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్స్ తో సినిమా మొత్తం చూసేలా చేస్తాయి. ఇక ఇప్పడు చెప్పుకోబోయే మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మరి ఈ సినిమా ఏంటి.. ఈ సినిమాను మీరు చూశారా లేదా ఓసారి చెక్ చేసేయండి.

తీరిగ్గా చూడాలే కానీ ఎంత చూసినా తరగనన్ని సినిమాలు ఓటీటీ లో ఉన్నాయి. ఇక వాటిలో హర్రర్ మూవీస్ అయితే లెక్కలేనన్ని ఉన్నాయి.. ఎన్ని చూసినా కానీ ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎంత భయపెట్టినా సరే.. హర్రర్ మూవీస్ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సీన్స్ ఉండడం వలన మూవీ చివరి వరకు చూసేలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాంటిదే.. ఇక ఈ మూవీ క్లైమాక్స్ అయితే నెక్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను మీరు చూశారా లేదా అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా స్టార్టింగ్ లో ఓ గ్రామాన్ని చూపిస్తారు. అక్కడ కోసిన్ అనే వ్యక్తి అడవిలో ఎదో వెతుకుతూ కనిపిస్తాడు.. అతనికి అక్కడ ఓ వజ్రం దొరుకుతుంది. దీనితో అతను పెద్ద ధనవంతుడు అయిపోతాడు. అదే ఊరిలో ఓ పెద్ద భవనాన్ని కొంటాడు. అప్పటికే అతని భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆమెను అక్కడికి తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే.. డోర్ మెన్ అనే అతను కూడా అదే అడవిలో ఎదో వెతుకుతూ ఉంటాడు. అక్కడ అతను ఆల్బర్ట్ అనే అతని సమాధిని కనిపెడతాడు. అతను ఆ సమాధిని తవ్వి.. ఆ మనిషి పుర్రెను తీసుకుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. ఆ తర్వాత దానికి మంత్రం తంత్రాలతో పూజలు చేస్తాడు. ఆ పూజ పూర్తైన వెంటనే అక్కడ ఉన్న సంచిలో నుంచి కట్టల కట్టలుగా డబ్బులు బయటకు వస్తాయి. కానీ కాసేపటికే అవి ఆకులుగా మారిపోతాయి.

ఆ తర్వాత అక్కడ నుంచి ఓ గొంతు వినిపిస్తుంది.. నీకు ఈ డబ్బులు కావాలంటే.. తనకు ఓ బలి ఇవ్వాలని అడుగుతుంది. ఇక్కడ మరొక సీన్ ను చూపిస్తారు…ఆ రోజు రాత్రి గ్రహణం రాబోతుందని.. కాబట్టి ఊరిలోని ఆడవారు, పిల్లలు బయటకు రావొద్దని.. ఒకవేళ వస్తే రాక్షసులు ఎత్తుకెళ్లిపోతారని చెప్తారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ హీరో భార్యను చూపిస్తారు. ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడంతో.. చెక్ అప్ చేయించుకుని.. ఆ రాత్రి అడవి మార్గంలో ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమె ప్రమాదానికి గురి అవుతుంది. ఎక్కడైతే డోర్ మెన్ ఆల్బర్ట్ సమాధి తవ్వుతాడో.. అదే సమాధిలో ఆమె పడిపోతుంది. తన భర్త ఆమెను కాపాడి ఇంటికి తీసుకుని వస్తాడు. ఆమెకు డెలివరీ అవుతుంది.. కానీ బిడ్డ మాత్రం ఒక మూటల బయటకు వస్తుంది.

దీనితో అక్కడ ఉన్న వాళ్ళు ఆ బిడ్డపై గ్రహణం పడకుండా చూసుకుంటారు.కానీ కాసేపటికి ఆ మూటను ఓపెన్ చేసి చూస్తే.. అందులో ఓ పెద్దాయన తల ఉంటుంది. అసలు అక్కడ ఏం జరిగింది ? ఆ మూటలో ఉన్న ముసలాయన ఎవరు ? డోర్ మెన్ ఎందుకు సమాధిలో నుంచి పుర్రెను తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే “భాయి అజీబ్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Show comments