ఈ వారం OTT లో ఏకంగా 7 తెలుగు సినిమాలు.. వీకెండ్ ఎంటర్టైన్మెంట్ పక్కా

This Week Telugu Movie Releases In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో సందడి చేసే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

This Week Telugu Movie Releases In OTT: ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో సందడి చేసే తెలుగు సినిమాలేంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో చాలా సినిమాలు ఎంటర్టైన్ చేయడానికి రెడీ గా ఉన్నాయి. కథను బట్టి అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించిన కానీ ముందు సెర్చ్ చేసేది మాత్రం తెలుగు సినిమాల కోసమే. ఇప్పుడు తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ మధ్య తెలుగు సినిమాలు బాగానే రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండడం విశేషం. మరి ఈ వారం ఓటీటీ లో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉండడం విశేషం. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు సినిమాలు ఇవే

శివం భజే:

అశ్విన్ బాబు నటించిన శివం భజే మూవీ ఆగస్ట్ 1న థియేటర్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ లో ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

బడ్డీ:

కొంతకాలం గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటించిన మూవీ బడ్డీ. ఈ సినిమా ఆగష్టు 2న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోతుంది. అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగిన ఈ మూవీ లాంగ్ రన్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆగస్ట్ 30 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ లో ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

దీపావళి:

తమిళ చిత్రం కిడా అనే సినిమాకు డబ్బింగ్ వెర్షన్ గా రూపొందించారు. తమిళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత తెలుగులో.. దీపావళి అనే పేరుతో గత సంవత్సరం ఈ సినిమాను థియేటర్ లో విడుదల చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్:

షేడ్స్ ఆఫ్ బేబీ పింక్:

సాధారణంగా షార్ట్ ఫిల్మ్స్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. ఈ సినిమాను చికాగో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ , గోల్డెన్ లీఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కు నీలిమ గుడవల్లి దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు తెలుగు షార్ట్ ఫిల్మ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రన్ టైమ్ కూడా తక్కువే కాబట్టి.. అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఐసీ 814: ది కాందహార్ హైజాక్:

దేశ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ గా చెప్పే.. కాందహార్ ప్లేన్ హైజాక్ పై రూపొందించిన సిరీస్.. “ఐసీ 814: ది కాందహార్ హైజాక్”. డిసెంబర్ 24, 1999లో ఈ భయంకరమైన ఫ్లైట్ హైజాక్ జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో దానిని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. పైగా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కథ. కాబట్టి ఈ సిరీస్ ను వెంటనే చూడండి.

పురుషోత్తముడు :

జూలై 26 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో ఈ మూవీ నెల లోపే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఆగస్ట్ 29 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఓటీటీ ఓ లుక్ వేసేయండి. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ వీకెండ్ ఈ మూవీని ఎంచక్కా ఫ్యామిలీతో చూసేయండి.

క్యాడెట్స్:

క్యాడెట్స్ గా జాయిన్ అయిన నలుగురు సాధారణ యువకులు.. ఇండియన్ ఆర్మీకి వెళ్లే జర్నీ ని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారు. నిజ జీవిత కథలను ఆధారంగా తీసుకుని రూపొందించిన కథలు.. ఈ మధ్య ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి.. ఈ సిరీస్ కూడా బాగానే మెప్పిస్తుంది. ఆగస్ట్ 30 నుంచి ఈ సిరీస్ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. సో ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సిరీస్ ను కూడా యాడ్ చేసుకోండి.

ఈ వీకెండ్ ఈ తెలుగు సినిమాలను , సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూసేయండి. వీకెండ్ లోపు ఇంకేమైనా సినిమాలు , సిరీస్ లు సడెన్ సర్ప్రైజ్ చేసే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమా అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments