Venkateswarlu
ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న సినిమాలు కూడా మంచి మంచి విజయాలను అందుకున్నాయి. దేశంలో మలయాళ సినిమాలకు క్రేజ్ పెరిగింది. కరోనా పరిస్థితులు తగ్గినా...
ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న సినిమాలు కూడా మంచి మంచి విజయాలను అందుకున్నాయి. దేశంలో మలయాళ సినిమాలకు క్రేజ్ పెరిగింది. కరోనా పరిస్థితులు తగ్గినా...
Venkateswarlu
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఓటీటీ వేదికలకు మహర్థశపట్టింది. నెలల పాటు ఇంటి దగ్గరే ఉండటం.. అది కూడా ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవటానికి అలవాటు పడ్డం వల్ల.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల వైపు మళ్లారు ప్రజలు. అప్పుడప్పుడే ప్రాచూర్యం పొందుతున్న ఓటీటీల్లో సినిమాలు చూడ్డానికి సిద్దమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు ఇంట్లో కూర్చుని చూసే వెసలు బాటు ఉండటంతో జనం ఓటీటీకి ఒకరకంగా అడిక్ట్ అయిపోయారు.
ఈ నేపథ్యంలోనే చిన్న చిన్న సినిమాలు కూడా మంచి మంచి విజయాలను అందుకున్నాయి. దేశంలో మలయాళ సినిమాలకు క్రేజ్ పెరిగింది. కరోనా పరిస్థితులు తగ్గినా ఓటీటీ వాడకంలో ఎలాంటి మార్పు రాలేదు. ఓటీటీకి అలవాటు పడ్డ జనం సినిమా హాళ్లకు వెళ్లటం మానేశారు. సినిమా థియేటర్లలో సినిమా విడుదలైన కొద్దిరోజులకే.. ఓటీటీలకు వస్తున్నాయి. దీంతో ఇంట్లో కూర్చుని సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీకే వచ్చేస్తున్నాయి.
కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు భారీ మొత్తం ఇచ్చి మరీ సినిమాలను కొంటున్నాయి. ఒక సినిమాను వివిధ భాషల్లోకి డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నాయి. అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కొత్తగా ఓ రూల్‌ను తెరపైకి తేబోతున్నాయట. ఆ రూల్ కారణంగా నిర్మాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో సినిమాలకు సంబంధించి ఈ నిర్ణయం కఠినతరంగా మారనుందట. సంక్రాంతి సమయంలో విడుదలయ్యే సినిమాలు హిట్ అయితే.. నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయడానికి. ఒకవేళ సినిమాలు ప్లాప్ అయితే..
రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేలా కొత్త రూల్ పెట్టాయంట. ఈ రూల్‌కు ఓకే అంటేనే.. డిజిటల్ రైట్స్‌కు ఓకే చెబుతున్నాయంట. వేరే మార్గం లేదు కాబట్టి.. నిర్మాతలు తమకు కొంచెం ఇబ్బంది ఉన్నా.. ఓటీటీల కొత్త కండీషన్‌కు ఓకే చేప్పేశారంట. కాగా, సినిమాలు థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని గతంలో కొంతమంది నిర్మాతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త రూల్‌కు ఓకే చెప్పారంట. ముందే డిజిటల్ ఒప్పందాలు జరిగినా కూడా.. సినిమా ప్లాప్ అయితే.. 30 నుంచి 40 శాతం డబ్బులు కట్ చేసి ఇస్తున్నట్లు సమాచారం. మరి, ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల కొత్త రూల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.