Shaitaan OTT: OTT లోకి కాస్త ఆలస్యంగా రానున్న సైతాన్ మూవీ.. న్యూ డేట్ ఎప్పుడంటే !

దాదాపు సినిమాలన్నీ కూడా అనుకున్న సమయానికే ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సార్లు అనేక కారణాల వలన ఆయా సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మే 3 న రావాల్సిన ఓ సినిమా కాస్త ఆలస్యంగా రానుంది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

దాదాపు సినిమాలన్నీ కూడా అనుకున్న సమయానికే ఓటీటీ లోకి వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సార్లు అనేక కారణాల వలన ఆయా సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మే 3 న రావాల్సిన ఓ సినిమా కాస్త ఆలస్యంగా రానుంది. ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

వీకెండ్ వస్తుందంటే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తాయి అని చెక్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. అయితే, కొన్ని సినిమాలు అనేక కారణాల వలన అనుకున్న సమయానికి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వవు. దీనితో మూవీ లవర్స్ కాస్త నిరాశ చెందుతూ ఉంటారు. ఈ వారం ఓ సినిమా విషయంలో అలాంటి పరిస్థితే ఏర్పడింది. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని.. కోట్ల రూపాయలను వసూళ్లు చేసిన ఈ సినిమాను.. థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూశారు. కానీ వారికి నిరాశ ఎదురైంది. ముందుగా ప్రకటించిన విధంగా ఈ సినిమా మే 3 నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ, ఆ సినిమా అనుకున్న టైమ్ కి ఓటీటీ లోకి రాలేదు. మరి ఆ సినిమా ఏంటో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం.

ఆ సినిమా మరేదో కాదు.. అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ముగ్గురు కలిసి నటించిన.. హర్రర్ సినిమా “సైతాన్”. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సైతాన్ సినిమాను గుజరాతి రీమేక్ గా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహించారు. మార్చి 8న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక ఈ సినిమాను మే 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. ప్రేక్షకులంతా కూడా ఈ సినిమాను చూసేందుకు సిద్ధం అయ్యారు. కానీ వారందరికీ నిరాశ ఎదురైంది. మే 3 న ఈ సినిమా ఓటీటీ లోకి రాలేదు. దీనితో కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా మే 4 అర్ధరాత్రి నుంచి .. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

థియేటర్ లో ఈ సినిమాను చూసిన వారికి ఈ సినిమా కథేంటి అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఓటీటీ లో ఈ సినిమా చూద్దాం అనుకునే వారు మాత్రం ఇంకా ఒక్క రోజు ఈ సినిమా ఎంట్రీ కోసం ఓపిక పెట్టాల్సిన ఉంటుంది. కొన్ని సినిమాలకు ఎంత కాలం వెయిట్ చేసిన పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అవి ఖచ్చితంగా వర్త్ వాచింగ్ ఫిల్మ్స్ అని అందరికి తెలుసు. కాబట్టి సైతాన్ సినిమా చూసేందుకు ఇంకా ఒక్క రోజు ఓపిక పట్టక తప్పదు. ఈ మధ్య కాలంలో కొన్ని సార్లు అనుకున్న సమయానికిస్ట్రీమింగ్ అవ్వట్లేదు అనే మాట వాస్తవమే. కానీ, ఒక్కసారి స్ట్రీమింగ్ స్టార్ట్ అయితే మాత్రం మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి. మరి సైతాన్ సినిమా ఓటీటీ లోకి రావడం ఆలస్యం అవ్వడంపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments