Swetha
ప్రతి వారం ఓటీటీ లో సినిమాలు వస్తూనే ఉంటున్నాయి. అలానే వాటి గురించి అప్ డేట్ కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి దాదాపు ఎవరు ఆ సినిమాలను మిస్ అవ్వరు. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను మిస్ అయిపోతుంటారు. మరి మీరు మిస్ అయిన సిరీస్ లలో ఈ సిరీస్ కూడా ఉందేమో చూసేయండి.
ప్రతి వారం ఓటీటీ లో సినిమాలు వస్తూనే ఉంటున్నాయి. అలానే వాటి గురించి అప్ డేట్ కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి దాదాపు ఎవరు ఆ సినిమాలను మిస్ అవ్వరు. కానీ.. అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను మిస్ అయిపోతుంటారు. మరి మీరు మిస్ అయిన సిరీస్ లలో ఈ సిరీస్ కూడా ఉందేమో చూసేయండి.
Swetha
వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాల కోసం, సిరీస్ ల కోసం ఎదురు చూసే ఓటీటీ మూవీ లవర్స్.. ఒక్కోసారి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలను మిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడంటే ఓటీటీ లలో ప్రతి వారం ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అవుతాయనే లిస్ట్ ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. దీనితో ప్రేక్షకులు కూడా వీక్ స్టార్టింగ్ లోనే.. వీకెండ్ కు ఏ మూవీ చూడాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. పైగా మూవీ లవర్స్ కు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా.. వీకెండ్ లో మళ్ళీ ఆ సినిమాల లిస్ట్ ను గుర్తుచేస్తూ ఉంటున్నాయి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్. సో ఎక్కడ ఇప్పుడు వచ్చే సినిమాలను, సిరీస్ లను ఎక్కడా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ, వీటి కంటే ముందు వచ్చిన కొన్ని మంచి సినిమాలను , సిరీస్ లను మాత్రం మిస్ అయిపోతుంటారు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ మీరు మిస్ చేసిన వాటిలో ఉందేమో.. ఇప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
ఇప్పటివరకు మనం చెప్పుకున్న సిరీస్ పేరు “గ్రిసెల్దా”. సిరీస్ పేరు చూసి తెలుగు కాదు కదా అనుకుని లైట్ తీసుకుంటే మాత్రం ఒక మంచి.. రియల్ ఫిక్షనల్ డ్రామా ని మిస్ అయినట్లే.. పైగా ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్ నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ కు .. 7.2 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు మనం గాడ్ ఫాదర్ పేరుతో వచ్చిన సినిమాను చూసే ఉంటాం. కానీ, గాడ్ మదర్ గురించి మాత్రం ఎక్కడా విని ఉండము. అటువంటి గాడ్ మదర్ తరహాలో వచ్చిన సిరీస్ ఏ ఈ “గ్రిసెల్దా”. గ్రిసెల్దా అనే లేడి తన భర్తను చంపి.. పిల్లలను తీసుకుని మయామి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక డ్రగ్ బిజినెస్ ను స్టార్ట్ చేస్తుంది. అక్కడ మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. కొంతకాలం తర్వాత అతనిని కూడా చంపేస్తుంది. ఇలా ముగ్గురు భర్తలను చంపేసి. క్రూరంగా ప్రవర్తిస్తుంది ఈ లేడి. అలా తన బిజినెస్ లో అడ్డొచ్చిన వారందరిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తుంది. ఈ క్రమంలో తనకు ఎదురైన సమస్యలు ఏంటి ! అక్కడ ఆమె గాడ్ మదర్ గా ఎలా ఎదిగింది ! అందులోను ఒక లేడీ అయ్యి ఉండి ఈ డ్రగ్ బిజినెస్ లోకి ఎందుకు ఎంటర్ అయింది ! ఈ ప్రాసెస్ లో వచ్చిన సమస్యలను ఎలా ఒంటరిగా డీల్ చేసింది ! అనేవి తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ఈ సిరీస్ ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని రూపొందించింది. ఇప్పటికి ఈ రియల్ ఇన్సిడెంట్ మిస్టరీ వెనుక జరిగిన వాటి గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఎం జరిగింది అనేది ఎప్పటికి అంతు చిక్కని రహస్యం అంటుంటారు. ఈ సిరీస్ లో ఆ లేడీ క్యారెక్టర్ కోపాన్ని, ధైర్యాన్ని అన్నిటిని కలిపి చూపిస్తారు. మొదట రెండు ఎపిసోడ్స్ చూస్తూ ఉన్న క్రమంలోనే మూడవ ఎపిసోడ్ నుంచి స్టోరీ ఒక రేంజ్ కు మారిపోతుంది. ఈ సిరీస్ కనుక మిస్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక వర్త్ వాచింగ్ సినిమాను మిస్ అయినట్లే. అందులోను ఈ మధ్య సినిమాలకంటే కూడా సిరీస్ ల మీద అందరికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కాబట్టి.. ఈ సిరీస్ ఖచ్చితంగా అందరికి నచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ ఎవరైనా మిస్ అయితే కనుక వెంటనే “గ్రిసెల్దా” సిరీస్ ను చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.