OTT Suggestion: OTTలో అనుక్షణం ఉత్కంఠ కలిగించే సినిమా.. పిల్లలున్నవారు ఖచ్చితంగా చూడాల్సిందే!

OTTలో అనుక్షణం ఉత్కంఠ కలిగించే సినిమా.. పిల్లలున్నవారు ఖచ్చితంగా చూడాల్సిందే!

OTT Suggestion: మీకు భయపెట్టే సినిమాలు, అనుక్షణం ఉత్కంఠ కలిగించే సినిమాలు అంటే ఇష్టమా? మీ మైండ్ ని పరిగెత్తించే సినిమాలు అంటే బాగా ఇష్టమా? తర్వాత ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? అని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఉత్కంఠ రేపే సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ సినిమా మీ కోసమే ఓటీటీలో ఎదురుచూస్తుంది.

OTT Suggestion: మీకు భయపెట్టే సినిమాలు, అనుక్షణం ఉత్కంఠ కలిగించే సినిమాలు అంటే ఇష్టమా? మీ మైండ్ ని పరిగెత్తించే సినిమాలు అంటే బాగా ఇష్టమా? తర్వాత ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? అని ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఉత్కంఠ రేపే సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ సినిమా మీ కోసమే ఓటీటీలో ఎదురుచూస్తుంది.

మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా వారితో కలిసి చూడాల్సిన సినిమా ఇది. అలా అని ఇదేమీ సాధారణ పిల్లల మూవీ కాదు. ఇదొక వణికించే చిత్రం. ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా? పిల్లల ప్రవర్తన ఇలా కూడా ఉంటుందా? అని అనిపించకమానదు. అసలు ఈ సినిమా చూశాక పిల్లల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళకూడదు అని అనుకుంటారు. అంతలా మిమ్మల్ని భయపెడుతుంది. ఓటీటీలో ఉన్న బెస్ట్ మూవీస్ లో ఇదొకటి. 45 లక్షల బడ్జెట్ లో తీశారు. కానీ సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.   

కథ:

ఈ సినిమా పేరు పిహు. పిహు (మైరా విశ్వకర్మ) అనే రెండేళ్ల పాప ఉదయాన్నే లేచి చూసేసరికి ఆమె తల్లి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. పాప మాత్రం.. అమ్మ ఇంకా నిద్రపోతుందేమో అని అనుకుంటుంది. తల్లిని నిద్రలోంచి లేపడానికి పాప ప్రయత్నించినా తల్లి లేవదు. ఇక చిన్న పిల్ల కావడంతో అల్లరి పనులు చేస్తుంది. ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్, వాటర్ ఫిల్టర్, ఐరన్ బాక్స్ వంటి వస్తువులను ఆన్ చేసి పెట్టేస్తుంది. వాటి గురించి ఏమీ తెలియదు. ఈ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిహు ప్రాణాలను ఎలా కాపాడుకుంది? ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? పిహు తల్లి బతికే ఉందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  

ఈ సినిమా చూడ్డానికి సింపుల్ గా ఉంటుంది. కానీ అనుక్షణం వణుకు పుట్టించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయి. ఇంట్లో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే ఎంత ప్రమాదమో తెలిపే విధంగా సీన్స్ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకరమైన వారిని ఆన్ చేసి వదిలేస్తే పరిస్థితి ఎంత భయంకరంగా, ప్రమాదకరంగా ఉంటుందో అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా మొత్తం ఒకే ఇంట్లో షూట్ చేశారు. అయినప్పటికీ ఎక్కడ కూడా బోర్ ఫీలవ్వరు. తరువాత ఏం జరుగుతుంది అని అనుక్షణం మన మైండ్ మనల్ని వెంటాడుతుంది. పిహుకి ఏం కాదు కదా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అంతలా ఆ పాత్రలో మైరా విశ్వకర్మ జీవించింది. పిహు తల్లి పాత్రలో ప్రేరణ శర్మ నటించారు.

మీరు ఈ సినిమా చూశాక జాగ్రత్త పడతారు. బాబోయ్ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేలా ఈ సినిమా ఉంటుంది. పిల్లలు ఇంట్లో కుదురుగా ఉండకుండా ఎలా పడితే అలా ఉంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాస్ సిలిండర్ వంటి ప్రమాదకర వస్తువులతో ఆడడం ఎంత ప్రమాదమో ఈ సినిమాలో చూపించారు. కాబట్టి మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూసి వాళ్ళకి కూడా చెప్పండి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది. హిందీ భాషలో ఉన్నప్పటికీ సినిమాలో డైలాగ్స్ తక్కువగా ఉండడం వల్ల అర్థమవుతుంది.         

Show comments