OTT News: సత్య దేవ్ ‘కృష్ణమ్మ’ మూవీ రాబోయేది ఆ OTT లోకే.. కానీ థియేటర్ లో మిస్ అవ్వకండి..

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వకముందే.. డిజిటల్ రైట్స్ ను కొనేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి టాక్ నడుస్తుంది.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అన్నీ కూడా థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వకముందే.. డిజిటల్ రైట్స్ ను కొనేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. అప్పుడే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ గురించి టాక్ నడుస్తుంది.

సినిమాలు థియేటర్ లో అలా వస్తున్నాయో లేదో.. ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గురించి టాక్ నడుస్తుంది. ఆ సినిమా ఏంటంటే.. టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు కొత్త కొత్త సినిమాలతో తమ టాలెంట్ ను కనబరుస్తున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే తమ విలక్షణమైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు ప్రేక్షకుల నుంచి బాగా వినిపిస్తున్న హీరో పేరు సత్య దేవ్. సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఓ మంచి హీరోగా ఎదిగాడు సత్య దేవ్. ఈ క్రమంలో తాజాగా సత్య దేవ్ నటించిన సినిమా “కృష్ణమ్మ”. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

సత్య దేవ్ నటించిన కృష్ణమ్మ సినిమా మే 10న థియేటర్ లో రిలీజ్ అయింది. సత్య దేవ్ కు ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ గా చెబుతున్నారు ఆడియన్స్. ఇప్పటివరకు ఎన్నో జోనర్స్ లో ప్రేక్షకులను అలరించిన సత్య దేవ్ ఇప్పుడు మంచి మాస్ యాంగిల్ లో ఈ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై .. కృష్ణ కొమ్మలపాటి నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్ కు జోడిగా.. అనిత రాజ్ నటించింది. వీరితో పాటు.. మీసాల లక్ష్మణ్, కృష్ణ బూరుగుల, అర్చన ముఖ్య పాత్రలలో అలరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్ముడు పోయాయి, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

ఇక కృష్ణమ్మ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. సంతోషంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతుకుతున్న ముగ్గురు స్నేహితుల డ్రీమ్స్ ను చెడగొడితే. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆ పరిణామాలు ఎక్కడి వరకు దారి తీస్తాయి అనేదే ఈ సినిమా కథ. విజయవాడ అంటే కేవలం పాలిటిక్స్, రౌడీయిజం మాత్రమే కాదని ఇంకా చాలా ఉన్నాయని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఓటీటీ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.. ఇప్పుడు మాత్రం థియేటర్ లో మిస్ కాకండి. ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడివరకు కొనసాగుతుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments