OTTలోకి ‘35: చిన్న కథ కాదు’ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే!

35 Chinna Katha Kaadu Movie OTT Release: ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయింది. ఏ ప్లాట్​ఫామ్​లో ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ అందుబాటులో ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

35 Chinna Katha Kaadu Movie OTT Release: ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్ నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అయిపోయింది. ఏ ప్లాట్​ఫామ్​లో ఎప్పటి నుంచి ఈ ఫిల్మ్ అందుబాటులో ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ హీరోయిన్ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘35: చిన్న కథ కాదు’. నందకిషోర్ ఇమాని డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్​ను హ్యాండ్సమ్ హంక్ రానా ప్రొడ్యూస్ చేశారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ సెప్టెంబర్ 6వ తేదీన రిలీజైంది మూవీ. ఈ చిత్రంలో నివేదా తల్లి క్యారెక్టర్ పోషించారు. స్మాల్ ఫిల్మ్​గా విడుదలైన ‘35: చిన్న కథ కాదు’ క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్​గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేయడానికి రెడీ అయిపోయింది.

తెలుగు ఓటీటీ ప్లాట్​ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్​కు సిద్ధమైంది ‘35: చిన్న కథ కాదు’. అక్టోబర్ 2వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ మొదలవనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిన్న కథ వెనుక పెద్ద పాఠం ఉంది.. ఇది మన ఇంటి కథలా అనిపిస్తుంది అంటూ ఒక పోస్టర్​ను ఆడియెన్స్​తో షేర్ చేసుకుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇక ఓటీటీ స్ట్రీమింగ్​కు రెడీ అవ్వాల్సిందే. బిగ్ స్క్రీన్స్​లో చూసి ఎంజాయ్ చేసిన వారు కూడా ఇంకోసారి చూడాలంటే ఓటీటీలో రెడీగా ఉంటుంది. మరి.. ‘35: చిన్న కథ కాదు’ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments