Venkateswarlu
Venkateswarlu
ప్రజా సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. అత్యుత్తమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరచుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, సీఎం జగన్ అర్చకులకు ఓ శుభవార్త చెప్పారు. విజయ దశమి పండుగను పురస్కరించుకుని వారికి తీపి కబురు అందించారు. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
26 జిల్లాల్లోని దాదాపు 1177 మంది అర్చకుల కనీస వేతనం 15,625 రూపాయలు చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అతి త్వరలో పెరిగిన జీతాలతో 1177 మంది అర్చకులు జీతాలను అందుకోనున్నారు. ఇక, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అర్చుకుల కష్టాలు తెలిసిన గొప్ప వ్యక్తని కొనియాడారు. కాగా, కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనం ప్రస్తుతం 10 వేల రూపాయలు ఉంది.
దాన్ని 15,625 రూపాయలు చేశారు. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనం 5 వేల రూపాయలుగా ఉంది. దాన్ని ఇప్పుడు 10 వేల రూపాయలు చేశారు. ఇక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. అమ్మ వారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించనున్నారు. మరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని దాదాపు 1177 మంది అర్చకుల కనీస వేతనాన్ని పెంచటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.