సిఎంను కలుస్తాం, సినిమాల రిలీజ్ అప్పుడే: దిల్ రాజు

అఖండ సినిమా తర్వాత సినిమాలు వరుసగా విడుదల అవుతాయని అందరూ భావించారు. ఆ తర్వాత పుష్ప సినిమా విడుదల కావడం ఆ సినిమాకు కూడా మంచి స్పందన రావడంతో కొత్త సినిమాలపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న సినిమాలకు మోక్షం లభించిందని, కొందరు అగ్ర దర్శకులు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉందని ఎదురుుచూశారు . ఇక అగ్రహీరోల సినిమాలకు సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది అనుకున్నారు.

అయితే అనూహ్యంగా రాజమౌళి సహా కొందరు దర్శక నిర్మాతలు చేసిన ప్రకటన తో అందరూ షాక్ అయ్యారు. జనవరి ఏడున ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల చేయడం లేదని సినిమా తేదీని త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. అయితే ఏప్రిల్ లో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ సినిమాతో పాటుగా చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాదే శ్యాం, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల కోసం ఎదురు చూశారు. ఈ సినిమాలు కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.

ఈ తరుణంలో ఓమిక్రాన్ వేరియంట్ చుక్కలు చూపించింది. వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేశారు. అటు ఏపీలో టికెట్ ధరల రగడ కూడా కాస్త కంగారు పెట్టింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేేశారు. సినిమాలు అన్నీ వరుసగా ఫిబ్రవరి చివరి వారం నుంచి విడుదల అవుతాయని అన్నారు. దాదాపు ప్రతీ సినిమాను క్రమంగా విడుదల చేస్తారని, దీనికి సంబంధించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

వేసవి లోపు పెద్ద సినిమాలను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. టికెట్ ధరల గొడవ త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ విధమైన ఆందోళన అవసరం లేదని సినిమాల నిర్మాతలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. అవసరమైతే తాము మరోసారి ఏపీ సిఎం వైఎస్ జగన్ ను కలుస్తామని, ఆయనకు తమ సమస్యలతో పాటుగా థియేటర్ యాజమాన్యాలకు ఉండే నిర్వహణ సమస్యలను వివరిస్తామని పేర్కొన్నారు. చిన్న చిన్న సినిమాలకు అండగా నిలబడతామన్నారు.

Show comments