అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు..?

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు…

ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి…

1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం..
2.HCM హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి, 3.అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ ,
4.MVP మైట్రల్ వాల్వు ప్రొలాప్సు ,
5.అరిథమిక్ ధోరణి.
6.Qtc పొడిగించే డ్రగ్స్ వినియోగం,
7.సొంతవైద్యంతో వాడే మందులు మరియు సప్లిమెంట్లు
8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ బాధ్యత వహిస్తుంది.

చాలా మరణాలు అరిథమిక్ VF వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ VT వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి., కాకపోతే కొన్ని ACS అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్సు అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు.. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు….

ఎక్కువ వ్యాయామం,జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన చర్య. ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు..

1. ECG,
2. ECHO CARDIOGRAM (ఎకో)
3. Treadmill Test or Stress Test అధిక ప్రమాదం ఉన్న వారిని పరీక్షించడానికి గుర్తించడానికి సరిపోతుంది.

కాని కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం అదే కొలెస్టెరాల్ చేరుకోవడం వలన ప్లాక్ లు వస్తాయి., ఇవి వంశపారంపర్యంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రెలీమియా అంటారు,,కొందరు హోమోసిస్టిన్ పెరిగిన వారిలో 20 ఏళ్ళనుంచే హార్ట్ ఎటాక్ లు వస్తాయి.. ఈ కొలెస్టెరాల్ ప్లాక్ రప్చర్ అయితే దానిమీద ప్లేట్ లెట్సు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవతాది..ఆ ప్లాక్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి హార్ట్ అటాక్ వస్తాది., మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 mg రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75mg 4 టాబ్లెట్ లు నమలాలి.. నోటినుంచే లాలాజలం ద్వారా అబ్జార్బవతాది,, ఇది క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపతాది…

ధూమపానం,మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం,ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని వొత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు.. అపుడపుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించుకోవాలి., అవసరమైతే మందులు, నియంత్రణ చేసుకోవాల,,

కొందరు హైరిస్కు ఉన్నవారు CT ANGIOGRAM 5 ఏళ్ళకొకసారి చేసుకోవాల., రక్తనాళము ల బ్లాక్ తో పాటి కాల్షియమ్ స్కోరు తెలుస్తాది.. లిపిడ్ప్రొఫైలు, బిపి, షుగరు సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ళతరవాత చేసుకోవాల..ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు,, రెండుపెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు.,దానితో పాటు ఎకోస్పిరిన్ 75mg వాడాలి…

Syncopal Attacks అంటే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు (మూర్ఛ), Syncope యొక్క చరిత్ర కలిగిన అభ్యర్థులు, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్ర గల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గుండెనొప్పి వస్తే 2 ఆస్పిరిన్ టాబ్లెట్ లు నమిలి మింగించాలి..లేదా దంచి నీళ్ళలో కలిపి తాగించి ఆసుపత్రి కి తీసుకెళ్ళాలి.. లేకుంటే ఎంత పెద్దాసుపత్రి అయినా ప్రాణాలను కాపాడలేరు. అర్ధమయిందిగా..రెండు ఆస్పిరిన్ 375 mg మాత్రలే ప్రాణాలు కాపాడతాయి. మీ కోట్లడబ్బు, పదవులు, అధికారాలు, పాపులారటీ, కార్పొరేట్ ఆసుపత్రి లు కాదు. 

రెండు ఆస్పిరిన్ 375 mg టాబ్లెట్ లు దగ్గర పెట్టుకోండి.

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Show comments