SNP
Washing Machine Blast, Ghaziabad, UP: ఎండలకు వాషింగ్ మెషీన్ పేలిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దాంతో పాటే అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
Washing Machine Blast, Ghaziabad, UP: ఎండలకు వాషింగ్ మెషీన్ పేలిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. దాంతో పాటే అగ్నిప్రమాదం కూడా జరిగింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
SNP
ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడికి మనుషులు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. కానీ, కొన్ని వస్తువులను మాత్రం పట్టించుకోకుండా ఎక్కడ పడితే పడుస్తున్నారు. అందులో వాషింగ్ మెషీన్ కూడా ఒకటి. అలా బాల్కనీలో ఎండ తగిలేలా పెట్టిన వాషింగ్ మెషీన్ పేలిపోయింది. ఆ పేలడు ధాటికి అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్‌లోని బాల్కనీలో ఉంచిన వాషింగ్ మెషీన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్రిప్రమాదం జరిగిందంటూ.. ఆ అపార్ట్‌మెంట్ మొత్తం అలెర్ట్ అయింది.
రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ సిటీ-2 సొసైటీకి చెందిన ఓ ప్లాట్ బాల్కనీలో వాషింగ్ మెషీన్‌ను ఎండలో ఉంచారు. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత 50 డిగ్రీలు దాటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎండ వేడికి.. ఆ వాషింగ్ మెషీన్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మండలు ఫ్లాట్‌కు కూడా వ్యాపించాయి. కొద్దిసేపటికే వాషింగ్ మెషీన్ పూర్తిగా కాలిబూడిదైంది. బాల్కనీ నుంచి దట్టమైన పొగలు, మంటలు బయటికి రావడంతో అపార్టెమెంట్ వాసులంతా గుమ్మిగూడారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వాషింగ్ మెషీన్‌లో మంటలు చెలరేగిన వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు గురువారం.. నోయిడాలోని బహుళ అంతస్థుల సొసైటీలో ఏసీ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం కారణంగా చాలా ఫ్లాట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ కేసు నోయిడాలోని సెక్టార్ 100లో ఉన్న లోటస్ బౌలేవార్డ్ సొసైటీకి సంబంధించినది. అయితే.. ఏసీ పేలుడు కారణంగా సంభవించిన అగ్నిప్రమాదం తీవ్రత ఇంకా కొనసాగుతోంది. మరి ఈ ప్రమాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.