కాశ్మిర్ లో ఇంటర్నెట్ లో నిలిపివేత మంచిదే

  • Published - 04:36 AM, Mon - 20 January 20
కాశ్మిర్ లో  ఇంటర్నెట్ లో నిలిపివేత మంచిదే

జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేతను సమర్ధిస్తూ నీతిఆయోగ్ సభ్యుడు సారస్వత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

వివరాల్లోకి వెళితే వీకే సారస్వత్ గాంధీనగర్ లో ఉన్న ధీరుభాయి అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 370 అధికరణం రద్దు చేసిన అనంతరం,జమ్మూ కాశ్మీర్ లో వివాదాస్పద సంఘటనలు జరగకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన సంగతిని ప్రస్తావిస్తూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టం ఏమిటి? ఇంటర్నెట్ లో కాశ్మిర్ ప్రజలు అశ్లీల చిత్రాలు చూడటం మినహా వారు చేసేది ఏమి ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. JNU లో పనిచేస్తున్న అధ్యాపకుల్లో సగం మంది కరుడుగట్టిన వామపక్ష వాదులని వ్యాఖ్యానించారు.

దీంతో సారస్వత్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తన మాటలను వక్రీకరించారని నా మాటల వల్ల కాశ్మిర్ ప్రజల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని సారస్వత్ కోరారు. కాశ్మిర్ ప్రజల హక్కులకు నేను వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు.

కాగా ప్రస్తుతం సారస్వత్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవురుంది. బాధ్యతాయుత పదవిలో ఉండి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు మండిపడుతున్నారు.

Show comments