ఆర్టీసీ చైర్మన్ పదవికి వర్ల రాజీనామా

ఎట్టకేలకు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్‌ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్‌-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన  నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

Show comments