Idream media
Idream media
కేంద్ర బడ్జెట్ 2022–23ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగో సారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రాముఖ్యతను నిర్మలా సీతారామన్ వివరిస్తున్నారు. రాబోయే 25 ఏళ్ల అభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది వంటిదని నిర్మలా అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 9.27 శాతం వృద్ధి ఉంటుందని చెప్పారు. మేకిన్ ఇండియా ద్వారా రాబోయే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎంతో ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
పర్వతమాల ప్రాజెక్టు ద్వారా క్లిష్టమైన ప్రాంతాలలో 8 రోప్‌వేలు నిర్మించి, పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించబోతున్నామని తెలిపారు. పీఎం గతి శక్తి ద్వారా 100 కార్గో టెర్మినల్స్ నిరించబోతున్నామని చెప్పారు. కవచ్ ప్రాజెక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించనున్నామని తెలిపారు. ఎల్‌ఐసీని ఈ ఏడాది ప్రవేటీకరణ చేయబోతున్నామని తెలిపారు. కెమికల్ ప్రీ ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నామని, అగ్రి స్టార్టప్‌ల కోసం నాబార్డు నుంచి రుణాలు అందిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Also Read : కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది..?
39.45 లక్షల కోట్ల బారీ బడ్జెట్..
ప్రతి ఏడాది బడ్జెట్ పెరుగుతోంది. ఈ ఏడాది భారీ బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. 39.45 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలను రూపొందించారు. ఇందులో ద్రవ్యలోటు 6.9 శాతంగా పేర్కొన్నారు. ద్రవ్యలోటును 2025–26 నాటికి 4.5 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్మల చెప్పారు. ప్రస్తుతం ఆదాయ వనరులు 22.84 లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు 1.43 లక్షల కోట్ల రూపాయలని వెల్లడించారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఒక నెలలో ఇదే పెద్ద మొత్తమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని తెలిపేందుకు ఇదే నిదర్శనమన్నారు.
మినహాయింపు లేదు..
ఆదాయపన్ను నుంచి మినహాయింపులు దక్కుతాయనుకున్న వారికి నిరాశే ఎదురైంది. బడ్జెట్‌లో ఆదాయపన్ను నుంచి ఎలాంటి మినహాయింపు లభించలేదు. ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలును మరింత సరిళీకరణ చేశారు. ఆర్థిక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసుకునేలా సరళీకరించారు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్ను విధించారు. బయటపెట్టని ఆదాయం సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలకు సిఫార్సు చేశారు. ఎలాంటి చట్టాల నుంచి మినహాయింపు లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
Also Read : జీడీపీ అభివృద్ధి భారీగా ఉంటుంది- ఎకనామిక్ సర్వే