కొత్త సార‌థులు “కారు” స్పీడు పెంచేనా?

తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎట్ట‌కేల‌కు జిల్లా అధ్య‌క్షుల నియామ‌కాల‌ను పూర్తి చేసింది. జిల్లా కార్యవర్గాలు, , జిల్లా అధ్యక్షుల నియామ‌కం గ‌తేడాది సెప్టెంబర్ లోనే ఉంటుంద‌ని అగ్రనేత‌లు ప్ర‌క‌టించారు. కానీ.. హుజూరాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌తికూలంగా రావ‌డంతో ఆ ఊసు లేకుండా పోయింది. ఓ సంద‌ర్భంలో అస‌లు టీఆర్ఎస్ లో జిల్లా అధ్యక్ష పదవుల‌కే మంగ‌ళం పాడే యోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. జిల్లా అధ్య‌క్షుల స్థానాల్లో కొత్తగా కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించే యోచ‌న‌లో గులాబీ బాస్ ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌యోగాలు అంత మంచివికావ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డంతో ఆ నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకున్నారు. తాజాగా ప్ర‌తి జిల్లాకూ అధ్య‌క్షుల‌ను ప్ర‌క‌టించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కారు స్పీడు కాస్త త‌గ్గిన మాట వాస్త‌వ‌మే. కొన్ని జిల్లాల్లో అయితే బ్రేకులు ప‌డుతున్నాయి. రాష్ట్రానికి గుండెకాయ‌లాంటి హైద‌రాబాద్ లో కూడా టీఆర్ ఎస్ క్రేజు త‌గ్గుతోంది. అనూహ్యంగా కాషాయ‌పార్టీ పుంజుకుంటోంది.

ఇటువంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తీవ్ర క‌స‌ర‌త్తుల అనంత‌రం బాధ్యుల‌ను నియ‌మించారు. సూర్యాపేట‌, సిద్ధిపేట, మ‌హ‌బూబాబాద్ జిల్లా బాధ్య‌త‌లు ఎంపీల‌కు అప్ప‌గించ‌గా, దాదాపు మెజార్టీ జిల్లాల్లో పేరున్న ఎమ్మెల్యేల‌నే అధ్య‌క్షులుగా నియ‌మించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టినుంచే పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని గులాబీ బాస్ కేసీఆర్ వారికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధ్య‌క్షుల నియ‌మకాల‌పై ఎక్క‌డా వ్య‌తిరేక‌త లేకుండా ముందుగానే చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో కొత్త సార‌థులు కారు స్పీడును పెంచుతారో, త‌గ్గిస్తారో చూడాలి.

జిల్లాల వారీగా అధ్య‌క్షులు వీరే..

01 అదిలాబాద్ జోగు రామన్న (ఎమ్మెల్యే)
02 కొమరంభీమ్ ఆసిఫాబాద్ కోనేరు కోనప్ప (ఎమ్మెల్యే)
03 మంచిర్యాల బాల్క సుమన్ (ఎమ్మెల్యే)
04 నిర్మల్ జి. విఠల్ రెడ్డి (ఎమ్మెల్యే)
05 నిజామాబాద్ ఏ. జీవన్ రెడ్డి (ఎమ్మెల్యే)
06 కామారెడ్డి ఎంకే ముజీబుద్దీన్
07 కరీంనగర్ జి.వి.రామక్రిష్ణారెడ్డి
08 రాజన్న సిరిసిల్ల తోట ఆగయ్య
09 జగిత్యాల కె. విద్యాసాగర్ రావు (ఎమ్మెల్యే)
10 పెద్దపల్లి కోరుకంటి చందర్ (ఎమ్మెల్యే)
11 మెదక్ ఎం. పద్మా దేవేందర్ రెల్యే)
12 సంగారెడ్డి చింతా ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
13 సిద్ధిపేట కొత్త ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)
14 వరంగల్ ఆరూరి రమేశ్ (ఎమ్మెల్యే)
15 హన్మకొండ దాస్యం వినయ్ భాస్కర్ (ఎమ్మెల్యే)

16 జనగామ పి. సంపత్ రెడ్డి (జెడ్పీ ఛైర్మన్)

17 మహబూబాబాద్ మాలోతు కవిత నాయక్ (ఎంపీ)

18 ములుగు కుసుమ జగదీశ్ (జెడ్పీ ఛైర్మన్)
19 జయశంకర్ భూపాలపల్లి గండ్ర జ్యోతి (జెడ్పీ ఛైర్మన్)
20 ఖమ్మం తాతా మధుసూదన్ (ఎమ్మెల్సీ)
21 భద్రాద్రి కొత్తగూడెం రేగా కాంతారావు (ఎమ్మెల్యే)
22 నల్గొండ రమావత్ రవీంద్ర కుమార్ (ఎమ్మెల్యే)
23 సూర్యాపేట బడుగుల లింగయ్య యాదవ్ (ఎంపీ)
24 యాదాద్రి భువనగిరి కంచర్ల రామక్రిష్ణారెడ్డి
25 రంగారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి
26 వికారాబాద్ మెతుకు ఆనంద్ (ఎమ్మెల్యే)
27 మేడ్చల్ శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ)
28 మహబూబ్ నగర్ సి. లక్ష్మారెడ్డి (ఎమ్మెల్యే)
29 నాగర్ కర్నూల్ గువ్వల బాలరాజు (ఎమ్మెల్యే)
30 జోగులాంబ గద్వాల బి. క్రిష్ణమోహన్ రెడ్డి (ఎమ్మెల్యే)
31 నారాయణపేట ఎస్. రాజేందర్ రెడ్డి (ఎమ్మెల్యే)
32 వనపర్తి ఏర్పుల గట్టు యాదవ్
33 హైదరాబాద్ మాగంటి గోపీనాథ్ (ఎమ్మెల్యే)

Show comments