Idream media
Idream media
క్యాసినో.. అదో జూదం. ఆడడం తప్పే. దాని వెనుక మంత్రి ఉన్నాడన్నది నిజమైతే కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ.. రాష్ట్రంలో అదొక్కటే ఇష్యూ కాదు. దాని వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదు. రాష్ట్ర ప్రజలకు పెద్దగా నష్టం లేదు. అయినా ఎందుకు టీడీపీ దాన్నే పట్టుకుని వేలాడుతోంది..? దాదాపు పది రోజులకు పైగా రాష్ట్రంలో అదొక్కటే సమస్య ఉందా? తాజాగా పార్టీ సీనియర్లతో జరిగిన సమావేశంలో కూడా అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా.. క్యాసినోపై పోరాటం చేస్తూనే ఉండాలని. ప్రతిపక్ష నాయకుడు సాధారణంగా రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తుంటారు. కానీ.. క్యాసినోపై పోరాటం చేయాలని పార్టీ మీటింగ్ లో కూడా పిలుపు ఇవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటో ఆయనకే తెలియాలి.
సంక్రాంతి నాటి నుంచి టీడీపీ క్యాసినో అంశాన్నే పట్టుకుని వేలాడుతోంది. అత్యాచార, హత్య ఘటనలపై విచారణ చేస్తున్నట్లుగా దీనిపై నిజనిర్ధారణ కమిటీ ని కూడా వేసింది. తాజాగా ఆ కమిటీలోని సభ్యులు గురువారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విచారణకు వెళ్లిన సమయంలో తమపై జరిగిన దాడిపై, పోలీసుల వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. అదేవిధంగా కొడాలి నాని ని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు క్యాసినో వ్యవహారంపై చంద్రబాబు రాసిన లేఖను గవర్నర్‌కు అందించినట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. క్యాసినో నిర్వహణపై డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అంతటితో ఆగకుండా.. టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ గా నిర్వహించిన భేటీ లో కూడా క్యాసినోపైనే చర్చ జరిగింది. క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ప్రక్రియ అని అని ఈ సమావేశంలో చర్చించడం మరీ విడ్డూరం. మంత్రి కొడాలి నాని పై చర్యలు తీసుకునే వరకు క్యాసినో వ్యవహారంలో టీడీపీ పోరాటం చేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు. ఇదంతా చూస్తే.. ప్రభుత్వంపైనా, ఎప్పటికప్పుడు తనపై విరుచుకుపడుతున్న కొడాలి నానిపైనా బాబుకు ఎంత అక్కసు ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి.. వ్యక్తిగత రాజకీయ ఎజెండాలకే టీడీపీ ప్రాముఖ్యత ఇస్తోందనే అంశం తేటతెల్లమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : డైవర్షన్ రాజకీయాలు ఎవరివి ఉమా..?