షాంపులు, హెయిర్ స్టైలింగ్ ప్రొడ‌క్ట్స్ తో మ‌గాళ్ల‌కు బ‌ట్ట‌త‌ల ప్ర‌మాదం, వాటిని క‌నిపెట్టేదెలా?

ప్రతిరోజూ చాలా మంది మగాళ్లు జుట్టుకు షాంపూ లేదంటే స్టైలింగ్ ప్రొడ‌క్ట్స్ వాడ‌తారు. అందులో కొన్నింటిని ఫ్రెండ్స్ స‌జెస్ట్ చేస్తారు. మ‌రికొన్నింటిని యాడ్స్ లో చూసి కొనేస్తారు. వాడేస్తారు. వీటివ‌ల్ల కొత్త జుట్టురాక‌పోగా, మీకు బ‌ట్ట‌త‌ల వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని అంటున్నారు వైద్య‌నిపుణులు.

యాడ్స్ లో షాంపూల‌ను చూస్తుంటే, వెంట‌నే కొని వాడేయాల‌ని పిస్తుంది. అలాగే చేస్తాం కూడా. అవేమీ మీరు న‌ల్ల‌టి జుట్టుతో అమ్మాయిల‌ను ఎట్రాక్ట్ చేయ‌డానికి సహాయపడతాయని అనుకోవచ్చు, కానీ అవే మీ జుట్టు, స్కాల్ప్ హెల్త్ కి హానికరం. కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉన్న షాంపులు, హెయిర్ స్టైలింగ్ ఉత్ప‌త్తుల‌ను వాడితే రెండు ప్ర‌మాదాలు. ఒక‌టి చుండ్రు వ‌స్తుంది. రెండోది ఉన్న జుట్టుకూడా రాలిపోతుంది.

స్టైలింగ్ ఉత్పత్తులలో 15- 25 రసాయనాలు ఉంటాయి. వాటిలో కొన్ని మీ స్కాల్ప్‌ను దెబ్బతీస్తాయి. వాటిని వాడితే, జుట్టులో నేచ‌ర‌ల్ గా ఉండాల్సిన తేమ పోతుంది. దానివ‌ల్ల‌ చుండ్రు వ‌స్తుంది. అంతేనా? హెయిర్ ఫోలికల్స్ రాలిపోతాయికూడా.

ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (Isopropyl Alcohol) ప్రొపైలిన్ గ్లైకాల్ (Propylene Glycol) వంటి హానికరమైన రసాయనాలు తేమ‌ను దెబ్బ‌తీస్తాయి. దానివ‌ల్ల వెంట్రుల‌కు ప‌గుళ్లు వ‌స్తాయి. వీటి వ‌ల్ల మంచి క‌న్నా న‌ష్ట‌మే ఎక్కువ‌.

ఎక్కువ మంది చేసే త‌ప్పు ఏంటంటే? రోజూ షాంపూను వాడ‌తారు. దానివ‌ల్ల కెమిక‌ల్స్ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రేం చేయాలి? మీ జుట్టుకు ఏం వేస్తున్నారో? ఎలా చేయాలో తెలుసుకోవాలి. మీరు స్కిన్ స్పెష‌లిస్ట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌క్క‌ర్లేదు. క‌నీసం హెయిర్ సెలూన్ స్టైలిస్ట్ తో మాట్లాడండి. కొంత అవ‌గాహ‌న రావ‌చ్చు. బ్రాండెండ్ కొంటాం. ఇక టెన్ష‌న్ ఎందుకు అని అనుకోవ‌ద్ద‌. పెద్ద బ్రాండ్స్ లోనూ లాభాల కోసం త‌క్కువ క్వాలిటీ ముడిప‌దార్ధాలు క‌లుపుతారు.

వీటిని మీరు వాడార‌నుకోండి, జుట్టుకు ఉండే సహజమైన నూనెలు, ప్రొటీన్‌లను ఇవి దెబ్బ‌తీస్తాయి. ఇక ఏముంది? జుట్టు చిట్లుతుంది, రాలిపోతుంది.

మ‌రి ఎలాంటి ప్రొడెక్ట్స్ కొనాలి? ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు షాంపూలలో Sodium Lauryl Sulfate (SLS), లారెత్ సల్ఫేట్ Laureth Sulfateలు ఉన్నాయా లేవా అన్న‌ది చూడాలి. ఇవి మీ జ‌ట్టు నుంచి నేచ‌రుల్ ఆయుల్ ని తొల‌గిస్తాయి. అవి ఉన్న షాంపుల‌ను వాడ‌కండి.

ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ప్రొపైలిన్ గ్లైకాల్ , పాలిథిలిన్ గ్లైకాల్ (PEG) వంటి రసాయనాలు కూడా జ‌ట్టును దెబ్బ‌తీస్తాయి.

అందుకే కొబ్బరినూనె వంటి సహజసిద్ధమైన వాటిని ఎంచుకొంటే బెట‌ర్.

Show comments