iDreamPost
iDreamPost
హోలీ వచ్చిందంటే జనం రకరకాల రంగుల్లో మునిగి తేలినట్లుగా.. ఎన్నికలు వచ్చాయంటే చాలు లీడర్ల రాజకీయ రంగులు బయటపడుతుంటాయి. గోడ దూకి కండువాలు మార్చే లీడర్లకు కొదవే ఉండదు.
బెంగాల్ లో ఈ ఎన్నికల రంగుల పండుగ గట్టిగానే జరుగుతోంది మరి. ఈ మధ్య పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు.. కాషాయ కలర్ పూసుకున్నారు. కాషాయ కలర్ అంటే అయిష్టంగా ఉన్న యశ్వంత్ సిన్హా.. మొన్ననే మూడు రంగులు పూసుకున్నారు.
తమిళనాడులో కూడా మూడు రంగులను వదిలేసిన కుష్బూ.. కాషాయ కలర్ లో మునిగారు.
ఇక తెలంగాణలో మూడు రంగుల కలర్ ఖాళీ చేయించిన కేసీఆర్.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు పింక్ కలర్ వేసేశారు. ఒకరిద్దరు ఎరుపు కలర్ నుంచి పింక్ కలర్ కు మారారు. పసుపు రంగునైతే మొత్తంగా ఊడ్చిపడేశారు. 2014లో ఒక లీడర్ అయితే ఒకేరోజులో ఏకంగా మూడు రంగులు మార్చి రికార్డు సృష్టించారు.
Also Read : ఉత్కంఠకు తెర.. సాగర్ బీజేపీ అభ్యర్థి ఖరారు..
ఏపీలో కెమికల్స్ కలిసిన కలర్స్ ను వైఎస్ జగన్ సపోర్టు చేయడం లేదు. పర్యావరణ హితమైన రంగులనే ప్రోత్సహిస్తున్నారు. అందుకే తమ పార్టీలోకి వచ్చే వారు ఎవరైనా పదవులను వదులుకుని రావాలని సూచిస్తున్నారు. స్వచ్ఛ రంగులతో రాజకీయం చేస్తున్నారు.
అప్పట్లో ఎన్టీఆర్ లేని టైం చూసుకుని ఒక పెద్దాయన మొత్తం పసుపు రంగు అంతా తనదేనని ప్రకటించుకున్నాడు. కానీ జనం మాత్రం… పసుపును పరిచయం చేసింది ఎన్టీఆరేనని తేల్చిచెప్పారు. తర్వాత కొన్నాళ్లకు మూడు రంగులు కడిగేసుకుని పుసుపు రంగు పూసుకున్న ఇంకో పెద్దాయన.. మొత్తంగా పసుపుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. కానీ కొత్త పసుపులో కెమకల్స్, ఇతర కలర్స్ కలిసిపోవడం వల్ల.. దాని నాణ్యత తగ్గిపోయింది.
మరికొందరు ఎంపీలు పసుపు నుంచి కాషాయానికి షిఫ్ట్ అయ్యారు. అయితే వాళ్లు పసుపును కడిగేసుకోలేదని, ఆ రంగును కాషాయంతో కప్పేశారని పొలిటికల్ సర్కిల్స్ చెబుతా ఉంటాయి.
తర్వాత ఫ్యాను గాలికి పసుపు పలుచబడింది.’గ్లాసు’లో దాచినా ఫలితం శూన్యం. ఆకాశమంత నిర్మలమైన నీలం.. చిగురించిన ఆశల ఆకుపచ్చ.. స్వచ్ఛమైన తెలుపు రంగుల ముందు వెలవెలబోతోంది.. అదన్నమాట రాజకీయ రంగుల ముచ్చట!!
Also Read : డీహెచ్ ఎఫ్ ఎల్ కుంభకోణం తెలుసా ?