రాజధానిగా అమరావతి ఒక్కటే కొనసాగాలంటే ఎం చేయాలో చెప్పిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు కాకుండా ఒకే ఒక రాజధాని అమరావతి కొనసాగాలంటే ఏమి చేయాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఐదు కోట్ల ఆంధ్రులు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, పోరాటంతోనే రాజధాని తరలింపును ఆపగలమన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహన్‌ 24 గంటల నిరాహారదీక్షలో లోకేష్‌ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి అనాలోచిన నిర్ణయం వల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి సాధించిన అదానీ, ప్రాంక్లిన్‌, టెంపుల్‌ టన్‌ వంటి సంస్థలు రాష్ట్రాన్ని వీడిపోతున్నాయన్నారు. సవ్యంగా పాలన జరుగుతున్న తరుణంలో రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా ప్రకటించటం ద్వారా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జిఎన్‌రావు కమిటీ తప్పుల తడక అని విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజలు ధైర్యంగా రోడ్డు మీదకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.

Show comments