iDreamPost
iDreamPost
శుక్రవారం తొమ్మిది సినిమాలు రిలీజయ్యాయి కానీ అందులో చాలా మటుకు కనీసం సాధారణ ప్రేక్షకులకు సైతం ఐడియా లేనివి. ఉన్నంతలో కాస్త గట్టి ప్రమోషన్లు చేసుకున్నవి అంతో ఇంతో ఆడియన్స్ దృష్టిలో పడ్డాయి. అందులో మిస్సింగ్ ఒకటి. మొన్నే సెలబ్రిటీలకు కొందరు మీడియా ప్రతినిధులకు ప్రీమియర్ వేసి మరీ నమ్మకాన్ని ప్రదర్శించారు. హర్షా నర్రా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మీద ఏ సెంటర్స్ లో కాసిన్ని అంచనాలు ఉన్నాయి. శ్రీని జ్యోశుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం అజయ్ అరసద. మరి మిస్సింగ్ లో ఏమైనా మిస్ అయ్యిందా అన్ని ఉన్నాయా రిపోర్ట్ లో చూద్దాం
పెళ్లి చేసుకున్న ప్రేమ పక్షులు గౌతమ్(హర్ష నర్రా), శృతి(నికీషా)లు ఓసారి కారులో రోడ్డు ప్రయాణం చేస్తుండగా ప్రమాదానికి గురవుతారు. ఆసుపత్రిలో చేరాక గౌతమ్ కోలుకుంటాడు. తీరా చూస్తే భార్య మాయమవుతుంది. తను కిడ్నాప్ కు గురయ్యిందని అర్థమవుతుంది. వేట మొదలుపెడతాడు. జర్నలిస్ట్ మీనా(మిషా నారంగ్)తోడొస్తుంది. అసలు ఆ అమ్మాయిని ఎవరు ఎత్తుకెళ్లారు, గౌతమ్ చివరికి ఆమెను చేరుకున్నాడా, దీని వెనుక ఉన్న అసలు విలన్ ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి. పాయింట్ లో మరీ కొత్తదనం లేకపోయినా ట్విస్టులతో దీన్ని థ్రిల్లింగ్ గా చెప్పాలని ప్రయత్నించాడు దర్శకుడు శ్రీను జోస్యుల.
డెబ్యూ మూవీని శ్రీను హ్యాండిల్ చేసిన తీరు సంతృప్తి పరచదు. ఫస్ట్ హాఫ్ టెంపో ఉండాల్సిన స్థాయిలో లేదు. చాలా భాగం చప్పగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఎక్కువగా పెట్టేసి అనవసరమైన కన్ఫ్యూజన్ కి తెరతీశారు. అక్కడక్కడా కొన్ని మెరుపులు ఉన్నప్పటికీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసేంత మ్యాటర్ ఇందులో లేకపోయింది. హర్ష లుక్స్ పరంగా బాగున్నాడు కానీ ఎమోషన్స్ ని పలికించడంలో ఇంకా స్టార్టింగ్ స్టేజే. సంగీతం ఛాయాగ్రహణం కొంతవరకు కాపాడాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఈ వీకెండ్ కి ఇంకే ఆప్షన్ లేకపోతే తప్ప ఇది మిస్ చేయకూడని సినిమా అని మాత్రం అనిపించుకోలేకపోయింది
Also Read : Super Star Rajinikanth : సూపర్ స్టార్ తెరకు సెలవు – ఇదీ నిజం