iDreamPost
iDreamPost
రోజురోజుకూ సోషల్ మీడియా కారణంగా ఆడపిల్లలపై జరిగే దారుణాలు ఎక్కువవుతున్నాయి. ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లలో అమ్మాయిలతో మాటలు కలపడం.. కలవాలి రమ్మని నమ్మించి, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం యువకులకు పరిపాటిగా మారింది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో వెలుగుచూసింది. ఫేస్ బుక్ లో పరిచయమైన ఇద్దరు యువకులు మైనర్లైన అక్కచెల్లెళ్లపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది.
నవాజ్ (21), ఇంతియాజ్ (21) అనే ఇద్దరు యువకులు.. అక్కాచెల్లెళ్లైన ఇద్దరు మైనర్లతో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకున్నారు. మాటలు కలిపి.. ప్రేమిస్తున్నామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాలికలు ఆ యువకుల్ని డైరెక్ట్ గా కలవగా.. మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. వారిద్దరూ రెండేళ్లుగా తన కూతుర్లపై అత్యాచారం చేస్తున్నారని తెలుసుకున్న బాలికల తండ్రి..సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సే చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరూ అంబర్ పేట్ కు చెందినవారుగా గుర్తించారు.