Idream media
Idream media
కొత్త సంవత్సరంలో తొలిసారి సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమంతోపాటు పలు విధాన నిర్ణయాలకు జగన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అగ్రవర్ణ పేదల్లోని 45–60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన ఆర్థిక సహాయం చేసే ఈబీసీ నేస్తం పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద మూడేళ్లపాటు అగ్రవర్ణాల్లోని 45–60 ఏళ్ల మహిళలకు 45 వేల రూపాయలను ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనుంది.
కేబినెట్ నిర్ణయాలు ఇవీ..
ధాన్యం కొనుగోళ్లకు ఐదువేల కోట్లరూపాయల కేటాయింపు. 21 రోజుల్లో రైతులకు నగదు చెల్లింపు
16 వైద్య కళాశాలల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం
వైద్య కళాశాలలకు రూ, 7,880 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం
ప్రస్తుత వైద్య కళాశాలల అభివృద్ధికి రూ. 3,820 కోట్లు కేటాయింపు
గ్రామీణ ప్రాంతాల్లో వాయిదాల్లో ఓటీఎస్ చెల్లింపునకు ఆమోదం
ఉద్యోగుల నూతన పీఆర్సీకి ఆమోదం
కోవిడ్‌తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం
అగ్రవర్ణాల పేద మహిళలకు 45 వేలు ఆర్థిక సహాయం
ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం
కిదాంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి కేటాయింపు
విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం
వన్ డిస్ట్రిక్ట్-వన్ మెడికల్ కాలేజీ ప్రతిపాదనకు ఆమోదం
Also Read : పీఆర్‌సీ జీవోలకు ఆమోదం.. ఉద్యోగులకు వివరించేందుకు కమిటీ