5 వేల కోట్ల స్కాంతో సన్నీ లియోన్‌కు సంబంధం ఏంటి?

బాలీవుడ్‌ను మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్‌ కుదిపేస్తోంది. దాదాపు 5 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ స్కామ్‌లో పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులకు కూడా సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమందికి ఈడీ నోటీసులు పంపింది. ఇక, ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకప్పటి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరు కూడా వినిపిస్తోంది. యూట్యూబర్‌ సాయి పత్రి తెలిపిన వివరాల మేరకు..

చత్తీష్‌ఘడ్‌ బిలాయ్‌లోని సౌరబ్‌ చంద్రకర్‌ జ్యూస్‌ షాపు నడుపుతూ ఉండేవాడు. అదే ఊరికి చెందిన అతడి స్నేహితుడు రవి ఉప్పల్‌ ఓ టైర్‌ షాపు నడుపుతూ ఉన్నాడు. అయితే, ఆ పనుల వల్ల వచ్చే ఆదాయం వారికి సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలోనే చంద్రకర్‌కు ఓ కస్టమర్‌ ద్వారా బెట్టింగుల గురించి తెలిసింది. దీంతో రవితో కలిసి బెట్టింగులు మొదలుపెట్టాడు. అయితే, బెట్టింగులు వేసి బాగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే బెట్టింగుల నిర్వహణలోకి దిగారు. ఇండియాలో బెట్టింగుల ద్వారా ఇబ్బందులు వస్తాయని దుబాయ్‌ వెళ్లిపోయారు.

అక్కడ ఓ ఇద్దరి పరిచయం ద్వారా వీరి దశ తిరిగింది. మహదేవ్‌ బుక్‌ పేరిట ఓ యాప్‌ను మొదలుపెట్టారు. ఇండియాతో పాటు వేరే దేశాల్లో కూడా బెట్టింగులు నిర్వహించేవారు. పోలీసులు, రాజకీయ నేతలు వీరికి అండగా నిలిచారు. సౌరబ్‌ పెళ్లి దుబాయ్‌ ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కోసం ఇండియాలోని బంధువులను ప్రైవేట్‌ జెట్లలో దుబాయ్‌ రప్పించారు. బాలీవుడ్‌ సెలెబ్రిటీలు డ్యాన్సులు చేయడానికి వెళ్లారు. దీంతో ఇది ఈడీ దృష్టికి వెళ్లింది. ఈడీ కారణంగా అంతా బయటపడింది. అప్పుడే బాలీవుడ్‌ వాళ్ల పాత్ర కూడా బయటపడింది. వారికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలినట్లు సమాచారం.

Show comments