Idream media
Idream media
ఆ రైతు రోజూ ఆ బస్సే ఎక్కుతాడు. అదే ఎక్కాలి కూడా. ఎందుకంటే.. ఆ మార్గంలో మరో బస్సు లేదు. ఆటో ఎక్కడు. ఎందుకంటే రైతుకు ఆర్టీసీ అంటే అభిమానం. అందుకే తన పొలంలో పండే బొప్పాయి బుట్టలకు లగేజీ టికెట్ తీసుకుని రోజూ ఆ బస్సులోనే వెళ్ళేవాడు. అప్పుడప్పుడు డ్రైవర్ కు బొప్పాయి పండ్లు ఇచ్చేవాడు. ఓ రోజు ఉచితంగా బొప్పాయిలు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఎక్కించుకోలేదు.
దానికి ఆ రైతు ఏం చేశారో తెలుసా..
కర్ణాటక లో ఇటీవల జరిగిన ఓ ఘటన బాగా వైరల్ అయింది. కారు కొనేందుకు వెళ్లిన రైతును.. నువ్వు కారు కొనలేవని సేల్స్ మ్యాన్ తక్కువ చేసి మాట్లాడడంతో కోపం వచ్చిన రైతు అతనికి స్నేహంకోసం సినిమా సీను చూపించాడు. డ్రైవర్ బస్సు ఎక్కించుకోకపోవడంతో అతడికి నడిరోడ్డుపై చుక్కలు చూపించాడు ఈ రైతు. అసలు విషయానికి వెళ్తే.. ఆ రైతుది నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. అతని పేరు గోపయ్య. వాళ్ళ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది. గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.
రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా ఆర్టీసీ డ్రైవర్ కు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో రైతు పండించిన బొప్పాయి పండ్ల ను బస్సులో తీసుకువెళ్ళకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతో గంట పాటు నిరసన వ్యక్తం చేశారు. మారేడు మాన్ దిన్నె రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు చటమోని గోపయ్య రైతు. తన వ్యవసాయ పొలంలో బొప్పాయిపండ్లు సాగుచేసి పండ్లను ప్రతిరోజు అచ్చంపేట డిపో నుండి కొల్లాపూర్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులో తనతో పాటు పండ్లకు లగేజీ టికెట్ తీసుకుని కొల్లాపూర్ పట్టణానికి తీసుకు వెళ్తాడు.
పండ్లకు లగేజీ టికెట్ తీసుకుని కొల్లాపూర్ పట్టణానికి తీసుకు వెళ్తాడు. ఇదే క్రమంలో డ్రైవర్ కు ప్రతిసారి ఉచితంగా పండ్లను ఇస్తున్నానని, ఒకరోజు మర్చిపోయి పండ్లు ఇవ్వక పోవడంతో డ్రైవర్ బస్సులో తీసుకుని వెళ్లకుండా వదిలేసి వెళ్లిపోయాడు. అదే బస్సు కొల్లాపూర్ కి వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో ఆవేదనతో రైతు గోపయ్య రోడ్డుకు అడ్డంగా పండ్ల బుట్టలను ఉంచి బస్సు వెళ్లకుండా గంట పాటు నిరసన వ్యక్తం చేశాడు. గ్రామానికి రవాణా సౌకర్యం కోసం కేవలం ఒక బస్సు ఉండడంతో అది కూడా డ్రైవర్ ఎక్కించుకోకపోవడంతో తాను పండ్లను కొల్లాపూర్ తీసుకెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
సజ్జనార్ సార్ ఏం చేస్తారో..
ఆర్టీసీ ఎండీ గా సజ్జనార్ బాధ్యత లు స్వీకరించాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. సంస్థ గౌరవాన్ని పెంచుతున్నారు. ఆర్టీసీ ప్రతిష్ట కు భంగం వాటిల్లేలా ఓ యాడ్ లో చూపించారని హీరో అల్లు అర్జున్ కు, యాడ్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వారు క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీ పై ఎంతో గౌరవం ఉండే రైతును ఇబ్బంది పెట్టి.. సంస్థకు చెడ్డ పేరు తెచ్చే డ్రైవర్ పై సజ్జనార్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఆర్టీసీకి మంచి పేరు తీసుకురావాలని ఆర్టీసీ కోసం ఎంతో కృషిచేస్తున్న ప్రస్తుత ఎండి సజ్జనార్ మరియు ఉన్నతాధికారులు స్పందించి డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని రైతులపై ఆగ్రహం కాకుండా ఆప్యాయత చూపాలని గోపయ్య కోరుతున్నాడు.
Also Read : మద్యం కావాలా?కిరాణా షాపులో దొరుకుతుంది చూడండి