కోడెల బినామీ అరెస్ట్

టిడిపి ప్రభుత్వ పాలనలో కోడెల కుటుంబం తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో కేట్యాక్స్‌ పేరుతొ బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో కీలక పాత్ర పోషించించిన గుత్తా నాగప్రసాద్‌ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. వసూళ్ల వ్యవహారంలో పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్‌ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్‌ పేరిట రాయించినట్లు తెలిసింది. 

Show comments