Kerala Police గ‌న్ వాడ‌కంపై పోలీసుల‌తోనే ట్ర‌యినింగ్. ఎక్కడో తెలుసా.?

మీకో గ‌న్ లైసెన్స్ ఉంది. కాని కాల్చ‌డం రాదు. కాని, సెక్యురిటీ ప్రొబ్ల‌మ్ ఉంది. మ‌రి ఏం చేయాలి? గ‌న్ ను ఎలా యూజ్ చేయాలో పోలీసులే శిక్షణ ఇవ్వబోతున్నారు. కాక‌పోతే తెలుగు రాష్ట్రాల్లోకాదు. కేరళలో.

కేర‌ళ పోలీసులు మీకు తుపాకీని పేల్చ‌డంలో ట్రయినింగ్ ఇస్తారు. కాక‌పోతే అందరికీకాదు. మీకు ఇప్ప‌టికే లైసెన్డ్ గ‌న్ ఉండాలి. లేదంటే లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకొని ఉండాలి. అలాంటి వాళ్ల‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు కేరళ డీజీపీ అనిల్​కాంత్ చెప్పారు. అధికారికంగా ఉత్తర్వులుకూడా జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం.. తుపాకీని హ్యాండిల్ చేయడంలో అనుభవం లేనివారికి రూ.5,000 ఫీజు. కాస్త అవగాహన ఉన్నవారికి రూ.1000కే శిక్షణ పొందవచ్చు.

అలాగ‌ని ట్ర‌యినింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అంద‌రినీ ఎంపిక చేయ‌రు. దరఖాస్తు చేసుకునే వారి మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంపిక చేస్తారు. ఈ సెలక్షన్ ట్రయల్‌ను దాటిన‌వారికే శిక్షణ.
అస‌లు పోలీసుల‌కు ఎందుకీ ఆలోచ‌న వ‌చ్చింది? ఓ వ్యక్తి తుపాకీ వినియోగంపై కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తుపాకీ లైసెన్స్​ ఉన్న వారికి శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది కోర్టు. అందుకే డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. గ‌న్ లైసెన్స్ ఉన్న‌వాళ్ల‌కు పోలీసుల ట్ర‌యినింగ్, దేశవ్యాప్తంగా చర్చనీయాంశ‌మైంది.

Show comments