Idream media
Idream media
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆ మధ్యన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. వైసీపీ నేతలు అవమానించారంటూ తీవ్రంగా బాధపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ తన బాధను వెళ్లగక్కారు. ఇప్పుడు ఆయన బాటలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా పయనిస్తున్నారు. టీడీపీలో సీనియర్ నేత అయిన ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే.. ఈయన కూడా చంద్రబాబు వలే వ్యవహరించారు. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే అని స్పష్టం చేసేశారు.
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడులో టీడీపీ కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ… కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని… పగతో రగిలిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అయితే తమపై వైసీపీ ఎంత కసి పెంచుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని కేఈ స్పష్టం చేశారు.
ఏపీలో వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కేఈ అభిప్రాయపడ్డారు. గతంలో దేశంలో ఇందిరాగాంధీ గాలి వీచినప్పుడే తాను గెలిచానని కేఈ కృష్ణమూర్తి గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు కంబాలపాడుకు టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్వగ్రామం కంబాలపాడులో కూడా కేఈ కృష్ణమూర్తి స్థానికులతో సమావేశం అయ్యారు. వారి వద్ద కూడా కేఈ తన ఆవేదనను వెళ్లగక్కారు.
వరుసగా సీనియర్ నాయకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంంటూ మీటింగ్ లు పెట్టడం ట్రెండ్ గా మారిందా అనేది పార్టీ వర్గాల్లో కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. మరి టీడీపీ నాయకుల సెంట్‌మెంట్ డ్రామాలు ఫలిస్తాయా?
Also Read : ఏపీలో అంత సిన్మా ఉందా?