iDreamPost
android-app
ios-app

గ‌ల్లీబాయ్ కాపీ సినిమా?

గ‌ల్లీబాయ్ కాపీ సినిమా?

బాలీవుడ్ సూప‌ర్‌హిట్ సినిమా గ‌ల్లీబాయ్ కాపీ సినిమా అని తేల్చేసి ఆస్కార్ రేస్ నుంచి ప‌క్క‌కి నెట్టేశారు. గ‌తంలో మ‌ణిర‌త్నం తీసిన నాయ‌కుడు సినిమా కూడా God Fatherకి ఇమిటేష‌న్ అని ఆస్కార్‌కి ప‌రిగ‌ణించ‌లేదు.

2002లో వ‌చ్చిన 8 MILE అనే సినిమాకి గ‌ల్లీబాయ్ కాపీ అని తేల్చేశారు. బి-రాబిట్ అనే రాప్ గాయ‌కుడు త‌న కెరీర్‌ని ఎలా నిర్మించుకున్నాడ‌నేది క‌థ‌. కాలిఫోర్నియాలో తీసిన ఈ సినిమాకి Best Original Song ఆస్కార్ అవార్డు వ‌చ్చింది. అందుకున్న వ్య‌క్తి ఈ సినిమా హీరో ఎమిన‌మ్‌.

1995లో జ‌రిగే ఈ క‌థ‌లో హీరో పేద‌వాడు. త‌ల్లి తాగుబోతు. గ‌ల్లీబాయ్‌లో కూడా హీరో పేద‌వాడు. తండ్రి ఎప్పుడూ తిడుతుంటాడు. రెండింటి క‌థ ఇంచుమించు ఒక‌టే. హీరో రాప్ గాయ‌కుడిగా ఎద‌గ‌డానికి చేసే పోరాటం.

8 MILE ప్రేర‌ణ‌గా తీసుకున్న , జోయాఅక్త‌ర్ గ‌ల్లీబాయ్‌ని అద్భుతంగా తీశారు. 238 కోట్లు వ‌సూలు చేసిన ఈ సినిమా ఇండియాలో పెద్ద హిట్‌. అయితే ఆస్కార్ క‌మిటీ విధివిధానాల ప్ర‌కారం కాపీ సినిమాని పోటీకి తీసుకోరు.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş