iDreamPost
iDreamPost
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాజాసింగ్ ను మరొసారి అరెస్ట్ చేశారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని అందుకే పిడి యాక్ట్ (Preventive Detention Act (PD Act) నమోదుచేశారని మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో ఇంతకుముందే రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉందని, ఈ కేసులు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యేపై పీడీయాక్ట్ నమోదు అయ్యిందని చెప్పారు.
ఈనెల 22న ఓ యూట్యూబ్ చానల్‌లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయనపై చాలా కేసులు నమోదైయ్యాయి. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని పోలీస్ కమీషనర్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2004 నుంచి రాజాసింగ్ వివాదస్పదంగానే ప్రవర్తిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేపై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మతపరమైవి 18 కేసులు ఇందులో కొన్ని కోర్టు విచారణలో ఉన్నాయి.
#WATCH | Telangana police arrests suspended BJP leader T Raja Singh from his residence in Hyderabad for his alleged remarks against Prophet Muhammad.
Massive protests had taken place on August 23, against the leader for his alleged statement. pic.twitter.com/PzwxHWHcY8
— ANI (@ANI) August 25, 2022