కింగ్ నాగార్జున తక్షణ కర్తవ్యం

కింగ్ అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ చివరికి డిజాస్టర్ గానే మిగలనుంది. కనీసం పది కోట్ల షేర్ కూడా తెచ్చే అవకాశాలు లేకపోవడంతో ఎంతో నమ్మకం పెట్టుకున్న ట్రేడ్ ఆశలు ఆవిరయ్యాయి. గాడ్ ఫాదర్ హిట్ కావడం ప్రభావం చూపించినప్పటికీ ఘోస్ట్ లో అసలు కంటెంట్ వీక్ గా ఉండటంతో టాక్ పాజిటివ్ గా బయటికి రాలేదు. ఇక రివ్యూల సంగతి సరేసరి. దీంతో అక్కినేని అభిమానులు నాగార్జునను ఇకపై యాక్షన్ సినిమాలు చేయొద్దని ట్విట్టర్ వేదికగా బ్రతిమాలుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హిట్లు ఫ్లాపులు అందరు హీరోలకు సహజమే కానీ అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్తున్న నాగ్ కు దానికి తగ్గ ఫలితం దక్కడం లేదనేదే వాళ్ళ బాధ.

1989లో శివ బ్లాక్ బస్టర్ సాధించినప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. కొత్తగా ఆలోచించాలి, ఎవరూ టచ్ చేయని జానర్లలో ఎక్స్ పెరిమెంట్లు చేయాలని చూసిన సినిమాలన్నీ అప్పట్లో బోల్తా కొట్టాయి. చైతన్య, కిల్లర్, ఇద్దరూ ఇద్దరే, నేటి సిద్దార్థ, జైత్రయాత్ర, నిర్ణయం ఇవన్నీ యావరేజ్ కు డిజాస్టర్ కు మధ్యలో నలిగిపోయినవి. ఏదీ కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళలేదు. కట్ చేస్తే తిరిగి వారసుడు, అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం లాంటి మాస్ బొమ్మలే యువసామ్రాట్ కు మార్కెట్ ని తిరిగి తెచ్చి పెట్టాయి. టెక్నికల్ గా ఇంటెలిజెన్స్ తో తీసిన రక్షణ కన్నా మసాలా అంశాలు జొప్పించి ఘరానా బుల్లోడే ఎక్కువ డబ్బులు తెచ్చిన వైనం మరువకూడదు.

ఇప్పుడు అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ అంటూ స్టయిలిష్ యాక్షన్ సినిమాల మోజులో పడుతున్న నాగార్జునకు రిజల్ట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నా కూడా వాటివైపు మొగ్గు చూపడం అభిమానుల అసహనానికి కారణం అవుతోంది. బంగార్రాజు మరీ గొప్పగా లేకపోయినా మాస్ అండతో ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలవడం మర్చిపోతే ఎలా. కింగ్ ని జనాలు ఏదో విక్రమ్ లో కమల్ హాసన్ లా చూడాలని కోరుకోవడం లేదు. ఆ మాటకొస్తే మనకు లోకేష్ కనగరాజూలు లేరు. అలాంటప్పుడు లేట్ ఏజ్ లో చేయాల్సింది రిస్కులు కాదు. అన్ని వర్గాలను అలరించేలా ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందో సరైన టైంలో గుర్తించడం

Show comments