Idream media
Idream media
సాధారణంగా ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ.. రాజకీయ సన్యాసం వంటి సవాళ్లు విసురుతుంటారు. తద్వారా అధికార పార్టీ పాలన పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే సంకేతాలను పంపిస్తుంటారు. అదే సమయంలో తమ పార్టీ క్యాడర్‌లో భరోసాను నింపేందుకు ఇలాంటి సవాళ్లు ఉపయోగపడుతుంటాయి. అయితే ఏపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ పాలన ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇంకా మరో రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. సాధారణంగా.. ఈ పాటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గత చరిత్ర చెబుతోంది. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మాట వినిపించడం లేదు. పైగా జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు.. వైసీపీకి భయపడే రోజులు పోయాయంటూ.. కార్యకర్తల్లో భరోసా నింపడం వద్దే ఉన్నారు.
ఈ పరిణామాలను బేరీజు వేసుకునే.. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే ధీమాను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని చెప్పిన ధర్మాన.. రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగురుతుందని, మళ్లీ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు చేసే పసలేని విమర్శలను ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత గింజుకున్నా.. మళ్లీ జగనే సీఎం అవుతారని చెప్పిన ధర్మాన.. అలా కాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.
ధర్మాన ధీమాగా ఇలాంటి ఛాలెంజ్ చేయడం వెనుక జగన్ సంస్కరణల పాలన, సంక్షేమ పథకాలేనని అర్థమవుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు చేర్చారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి అధికారులను ప్రజల మధ్యన కూర్చోబెట్టారు. ఏ పని అయినా.. తమ గ్రామం, వార్డులో అయ్యేలా మునుపెన్నడూలేని వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ పథకాల అమలు మరో చరిత్ర. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు అందింస్తుండడం వల్ల.. టీడీపీ సానుభూతి పరుల్లోనూ సీఎం జగన్ పట్ల సానుకూలత కనిపిస్తోంది. లంచాలు, స్థానిక నేతల ప్రమేయం లేకుండా.. సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పింఛన్లు.. అందిస్తుండడంతో పార్టీలకు అతీతంగా అందరూ జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల్లో సీఎం జగన్ పట్ల కనిపిస్తున్న ఈ సానుకూలత.. అంతిమంగా తమకు ఓట్లు కురిపిస్తాయని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.
Also Read: మాజీ ఉప ముఖ్యమంత్రి కన్నీళ్లు ..