వ‌ణుకుతున్న ఏపీ.. ఎందుకో తెలుసా..?

అవును.. ఏపీలోని చాలా ప్రాంతాలు వ‌ణుకుతున్నాయి. ఏ రాజ‌కీయ గొడ‌వ‌ల‌కో, అల్ల‌ర్ల‌కో కాదు.. త‌గ్గిన ఉష్ణోగ్ర‌త‌ల‌కు. పెరిగిన చ‌లికి. రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త బాగా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. సాధార‌ణంగా జ‌న‌వ‌రి త‌ర్వాతి నుంచి చ‌లి త‌గ్గుతూ వ‌స్తుంది. కానీ.. ప్ర‌స్తుతం అధిక ప్రాంతాల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ ముందు నుంచీ చెబుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. అన్న‌ట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో చ‌లి వ‌ణికిస్తోంది. పిల్ల‌లు, వృద్ధులు ఇబ్బందులు ప‌డుతున్నారు.

అస‌లే వెంటాడుతున్న ఒమైక్రాన్ భ‌యానికి తోడు.. ఉష్ణోగ్ర‌త‌‌‌లు త‌గ్గ‌డంతో ప్ర‌జ‌ల రోగ నిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపుతోంది. చాలా మంది జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి రుగ్మ‌త‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. క‌రోనా విస్త‌ర‌ణ నేప‌థ్యంలో ఏది సాధార‌ణ జ్వ‌ర‌మో, క‌రోనానో తెలియ‌క స‌త‌మ‌తం అవుతున్నారు. నిర్ధార‌ణ కోసం ప్ర‌భుత్వ కేంద్రాల వ‌ద్ద క్యూ క‌డుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ చలి తీవ్రంగా వుండే అరకు ఈసారి కూడా అదే చలి ప్రభావం కనిపిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో జంగమహేశ్వరపురంలో శనివారం ఉదయం 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఏపీ రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో కనీస ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా వుంది. గతంలో 13.2 డిగ్రీల సెల్సియస్ గా వుండగా అది 4.2 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నంలో 14 డిగ్రీలు నమోదైంది. బాపట్లలో 15.1 నమోదైంది. గత ఉష్ణోగ్రతల కంటే 2.5 డిగ్రీలు తక్కువ. కర్నూలులో 15.5 డిగ్రీలు కాగా గతంలో కంటే 2.1 డిగ్రీల సెల్సియస్ గా వుంది. తూర్పు నుంచి వస్తున్న శీతల గాలుల కారణంగానే 2 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి రానున్న రెండురోజులలో వుంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.గత వారంలో చింతపల్లిలో 9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా తాజాగా అది 5.6 డిగ్రీలకు పడిపోయింది.

మ‌రి కొద్ది రోజులు ఏపీలో ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పిల్ల‌లు, వృద్ధులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. వ‌రుస‌గా మూడురోజుల పాటు జ్వ‌రం త‌గ్గ‌క‌పోతే.. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల అయి ఉంటుంద‌ని ఈజీగా తీసుకోవ‌ద్ద‌ని, వైద్యుల‌ను సంప్రదించి త‌గిన ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచిస్తున్నారు. కాగా, ఈ చ‌లి పులి కొంద‌రిని ఇబ్బంది పెడుతున్నా.. ఆ వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేసేందుకు అర‌కు, లంబ‌సింగి వంటి ప్రాంతాల‌ను సంద‌ర్శించేందుకు యువ‌త ఆస‌క్తి చూపుతుండ‌డం గ‌మ‌నార్హం.

Show comments