Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి రానున్నారు. తాడేపల్లి నుంచి ఆయన హుటాహుటిన ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఈ రోజు ఉదయం మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలసిన వెంటనే సీఎం జగన్ హైదరాబాద్కు వచ్చేందకు సిద్ధమయ్యారు. ఈ రోజు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మలు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు.
కాగా, గౌతమ్ రెడ్డి కుమారుడు అమెరికాలో ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి అతను హైదరాబాద్ చేరుకోనున్నారు. గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని రేపు ఉదయం ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లికి తరలించనున్నారు. ప్రజల సందర్శణార్థం ఉంచనున్నారు. ఎల్లుండి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించనున్నారు.