CM YS Jagan – మనసులు గెలిచావ్‌ జగన్‌

పింఛన్‌ సొమ్మును 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచే సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగం ప్రజల హృదయాలను తాకింది. జగన్‌ను వ్యతిరేకించే వారు కూడా.. ఆ ప్రసంగం తర్వాత.. ఆయనకు అభిమానులుగా మిగిలిపోతారనడంలో అతిశయోక్తి లేదు. పేదల పట్ల, అందులోనూ ఆసరా అవసరమైన వారి పట్ల జగన్‌ ఎలాంటి దృక్ఫథంతో ఉన్నారో ఆ ప్రసంగం ద్వారా వెల్లడైంది. పింఛన్‌ సొమ్ము పెంచడంపై, మూడు వేల రూపాయలకు చేస్తాననడంపై జరుగుతున్న విమర్శలకు సమాధానం చెప్పిన జగన్‌.. ఆ విమర్శలు చేసే వారిని కూడా తనకు అభిమానులుగా మార్చుకున్నారు.

ఇంతకీ జగన్‌ ఏమన్నారంటే..

‘‘పింఛన్‌ సొమ్ము పెంచుకుంటూ పోతున్నాడు జగన్‌. గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయల పింఛన్‌.. వస్తూనే 2,250 చేశాడు. ఈ రోజు 2,500 చేస్తున్నాడు. ఈ జగన్‌ చేస్తున్న ధోరణి బాగాలేదని చెప్పేవారు ఉంటారు. మంచి చేస్తావుంటే.. ఆ మంచిని విమర్శించేవారు చాలా మంది ఉంటారు.

తమకు తాముగా జీవితమంతా కష్టపడినా కూడా నాలుగు రూపాయలు మిగిలించుకోలేని నిర్భాగ్యులు ఎంతమంది ఉన్నారో ఈ విమర్శించే వారికి తెలుసా..? కన్న పిల్లల నుంచి ఎలాంటి సహాయం అందని అభాగ్యులు, సంపాదించే భర్తను కోల్పోయి, తమకు తాముగా సంపాదించుకోలేని వితంతువులు, వివిధ సాంప్రదాయ, కుల వృత్తుల్లో తమ జీవితాలనే ధారపోసి, వయస్సు మల్లుతున్న దశలో ఈ రోజు ఆ వృత్తి కొనసాగించలేక, ఆర్థికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్థకంగా మారిన వృత్తుల్లో ఎంత మంది ఉన్నారో వీరందరికీ తెలుసా..? వారికి ఏదైనా మనం చేస్తే.. మంచి అంటారా..? చెడు అంటారా..?’’ అని జగన్‌ పింఛన్ల సొమ్ము పెంపుపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడమేగాక.. ఆ విమర్శలు చేసే వాళ్ల మనసులు కూడా గెలుచుకున్నారు. 

Also Read : వావ్‌.. జగన్‌ ఏం చెప్పారు..! కోటాలు లేవు..! కోతలు లేవు..!!

Show comments