Chandrayaan-3, YS Jagan Mohan Reddy: చంద్రయాన్-3 సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

చంద్రయాన్-3 సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

భారత ప్రజలే కాకుండా యావత్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ఎట్టకేలకు సక్సెస్ అయింది. 6 గంటల 4 నిమిషాలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టింది. ఈ విజయంతో భారత్ చరిత్ర పుటల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. చంద్రుని దక్షిణ ధృవంపై కాలుమోపిన మొట్ట మొదటి దేశంగా భారత్ రికార్డ్ నెల కొలిపి సత్తా చాటింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందించి ఇస్రో శాస్తవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సైతం ట్విట్టర్ వేదిగా స్పందించి ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు నాతో పాటు భారతదేశంలోని ప్రతీ పౌరుడు గర్వంతో నిండిపోయారు. ఈ అపురూపమైన ఫీట్ మన సొంతం. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుండి ప్రారంభం కావడం మరింత ప్రత్యేకమైనది. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అందరికీ నా శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం చంద్రయాన్-3 విజయంపై స్పందించారు. ఇంతటి విజయాన్ని సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే  చంద్రయాన్-3 సక్సెస్ పై జగన్ చేసిన  పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.

ఇది కూడా చదవండి: బిగ్ బ్రేకింగ్: చంద్రయాన్ 3 విజయంతం.. జయహో భారత్

Show comments