Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు వద్ద అక్షయ పాత్ర వారు నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కిచెన్‌లో ఒకేసారి 50 వేల మందికి భోజనం ఏర్పాటు చేసేందుకు వీలుగా నిర్మించారు. అక్షయ పాత్ర రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. కిచెన్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్.. భవనంలో విద్యార్థులకు భోజనం వడ్డించారు.
అక్షయ పాత్ర వారి కిచెన్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్.. తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండ వద్ద హరేకృష్ణ మూమెంట్ ఇండియా విజయవాడ వారు నిర్మించ తలపెట్టిన హరే కృష్ణ గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు. చెన్నై–కోల్‌కత జాతీయ రహదారి వెంబడి కొలనుకొండ వద్ద దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న ఈ హరేకృష్ణ గోకుల క్షేత్రం రాష్ట్రంలోనే అదిపెద్ద క్షేత్రం కాబోతోంది. ఈ క్షేత్రంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో రాధాకృష్ణ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాలతోపాటు కల్చరల్ ఎక్స్‌పో, సంస్కార హాల్, కృష్ణ లీలాస్, గోశాల, అన్నదానం హాల్, మెడిటేషన్ హాల్, ఆశ్రమం, భగవద్గీత మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
జాతీయ రహదారి వెంబడి ఉన్న దేవాదాయ శాఖ భూమిని ప్రభుత్వం హరేకృష్ణ మూమెంట్ ఇండియా విజయవాడ వారికి లీజుకు ఇచ్చింది. ఈ క్షేత్రం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఆ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగా వెలుగొందబోతోంది.
Also Read : ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు శంకుస్థాపన.. కేంద్రానికి వైఎస్ జగన్ కృతజ్ఞతలు