బ్రేకింగ్: మేడారంలో బిజెపి ఉత్తరాది రాజకీయం

తెలంగాణాలో బలపడే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రతీ విషయాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాల ద్వారా… రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి బిజెపి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాది తరహాలో తెలంగాణాలో కూడా కొన్ని భావోద్వేగాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడు ప్రతిష్టాత్మక మేడారం జాతర మీద బిజెపి నేతలు దృష్టి సారించడం వివాదాస్పదం అవుతుందనే చెప్పాలి. 

ఎన్నడు లేని విధంగా జాతీయ స్థాయి నాయకులను, కేంద్ర మంత్రులను ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకత్వం ఆహ్వానిస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళడం హాట్ టాపిక్ అయింది. కేంద్ర గిరిజనశాఖ మంత్రి రేణుక సింగ్ తో కలిసి హెలికాప్టర్ లో మేడారం కు కిషన్ రెడ్డి ఈ ఉదయం చేరుకున్నారు. వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయన. బిజెపి కార్యాలయం నుంచి గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఒరన్ తో కలిసి సమక్క జాతరకు బండి సంజయ్ వెళ్తున్నారు. 

బండి సంజయ్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు అలాగే భారీ ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు మేడారం వెళ్తున్నారు. హుజురాబాద్ నుండి మేడారంకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బయల్దేరి వెళ్ళారు. ఇక కిషన్ రెడ్డి… నిలువెత్తు బంగారం ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు కిషన్ రెడ్డి. బిజెపి నేతల వైఖరి చూస్తుంటే కచ్చితంగా ఈ అంశాన్ని ఆ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సెంటిమెంట్ ప్రకారం సిఎం కేసీఆర్ రాకపోతే… దాన్ని వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం కనపడుతోంది.

దీనితో మేడారం జాతర తర్వాత వచ్చే రాజకీయ విమర్శలు ఏ విధంగా ఉంటాయి… ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. రెండేళ్ళ క్రితం జరిగిన జాతర సమయంలో బిజెపి నేతలు ఎక్కడా కనపడలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మంత్రులు స్వయంగా అక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా ఆరుగురు మంత్రులు, స్థానిక ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉండటం అధికారులతో కలిసి ముందుకు వెళ్ళడంతో అంతా సవ్యంగానే జరుగుతోంది.

Also Read : గుప్తదాతలే కాదు గుప్త అభిమానులూ ఉన్నారు..!

Show comments