Idream media
Idream media
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ, తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఎన్‌డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరి పోటీ సాగుతోంది. 243 స్థానాలు గల బిహార్ అసెంబ్లీలో 120 స్థానాల్లో ఎన్‌డీఏ, మహాకూటమి 116 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎల్‌జేపీ ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది.
మధ్యప్రదేశ్‌లో జరిగిన 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 28 స్థానాలకు గాను ఇప్పటి వరకూ 27 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా. బీజేపీ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఏడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తెలంగాణలో జరిగిన ఏకైక దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అన్నట్లుగా ఎన్నికల వేళ పరిస్థితులు మారాయి. అందుకు తగినట్లుగానే ఫలితాల సరళి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో బీజేపీకి 6,492 ఓట్లు, టీఆర్‌ఎస్ 5,357 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,315 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం నాటికి బిహార్, మధ్యప్రదేశ్, దుబ్బాకల్లో అభ్యర్థుల తలరాతలు తేలే అవకాశం ఉంది.