iDreamPost
iDreamPost
టెక్ దిగ్గజం ఐఫోన్ 13 ప్రో మోడల్‌లతో పోలిస్తే ఐఫోన్ 14 ప్రో మోడళ్ల ధరలను పెంచనుంది. అంచనా ప్రకారం, ఐఫోన్ 13 సిరీస్‌తో పోలిస్తే ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో లైనప్ రేట్లు యేడాదికి 15 శాతం మేర అంటే $1,000 నుండి $1,050 వరకు పెరుగుతాయని అంటున్నారు. అమెరికాలో , iPhone 13 Pro రేటు 999 డాలర్ల నుంచి మొదలవుతోంది. ఇక iPhone 13 Pro Max ధర $1,099 . ఐఫోన్ 14 ప్రో $1,099 నుండి మొదలుకావచ్చు. ఇక ఐఫోన్ 14 ప్రో మాక్స్ రేటు ఎక్కువ. 1,199 డాలర్లు. కాని ప్రో మోడళ్ల మరింత రేటు పెరగొచ్చని అంటున్నారు.
ఐఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్ కొత్త డిజైన్, మంచి కెమెరా, ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా వచ్చే బ్యాటరీలతో వస్తోంది. ఏరకంగా చూసినా ఇప్పుడున్న ఐఫోన్ ల కన్నా ప్రతి అంగుళం బెటర్ మెంట్ తో రానుంది. ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా లాంగ్ ప్రొఫైల్, మంచి కెమెరా మాడ్యూల్‌తో వస్తాయని లీక్స్ చెబుతున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ లో రెండు ప్రో మోడల్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 48MP , 12MP అల్ట్రా-వైడ్ , టెలిఫోటో లెన్స్‌తో ఉన్నాయి. iPhone 14 సిరీస్ 8K వీడియోలో షూట్ చేయొచ్చు.
Apple iPhone 14 Pro మోడల్ 8GB RAM , 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. iPhone 13 మోడల్ లో 128GB స్టోరేజ్ తో ఉన్నాయి. కాని, ఐఫోన్ 14 సిరీస్ మాత్రం బేస్ స్టోరేజ్ కెపాసిటీ 64GB. ప్రొ, నాన్ ప్రొ వేరియింట్స్ మధ్య తేడా చూపించాలనుకొంటోంది ఆపిల్. అందుకే బేస్ స్టోరీస్ తో మొదలుపెట్టి, ప్రో వచ్చేసరికి, కెమేరాలో తేడా కనిపిస్తోంది.
iPhone 14 లైనప్ లో పెద్దగా ఛేంజెస్ లేవు. బేస్ ఐఫోన్ 14 మోడల్ ల్లో కొద్దిగా తేడాలతోనే డిజైన్‌లున్నాయి. ప్రో మోడల్ ల్లో మాత్రమే పెద్దగా తేడాలు కనిపిస్తాయి. అందుకే ఈ మోడల్స్ నే ప్రచారం చేస్తున్నారు.
ఆపిల్ 6.1-అంగుళాల ఐఫోన్ 14, 6.7-అంగుళాల ఐఫోన్ 14 మాక్స్, 6.1-అంగుళాల ఐఫోన్ 14 ప్రో, 6.7-అంగుళాల ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు, ఆపిల్ వాచ్ సిరీస్ 8నికూడా ఆవిష్కరించొచ్చని అంటున్నారు.