Idream media
Idream media
పీఆర్‌సీపై ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య నెలకొన్న బేధాభిప్రాయలు కొనసాగుతుండగా.. ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ ఈ రోజు ఆమోదముద్ర వేశారు. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో.. ఈ రోజు ఉద్యోగ విమరణ చేసే వారికి ఊరట లభించింది. సకాలంలో ఫైల్‌కు రాజముద్ర పడడంతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చూపించారని ఉద్యోగులు కొనియాడుతున్నారు.
పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు సీఎం జగన్‌తో భేటీ తర్వాత.. వారు ఊహించని విధంగా ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, సొంత ఇళ్లు కేటాయింపు హామీలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ హామీల్లో తక్షణమే ఉద్యోగ విరమణ వయస్సును పెంచారు. మధ్య, ఎగువమధ్య తరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వేసే లే అవుట్లలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. వారికి ప్రత్యేకంగా 20 శాతం రిబేటు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీని వ్యతిరేకిస్తున్నాయి. నూతన పీఆర్‌సీతో తమ జీతాలు తగ్గుతాయని ఉద్యోగులు వాదిస్తుండగా.. ఏ ఒక్కరి జీతం తగ్గబోదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పాత జీతాలనే ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుండగా.. కొత్త పీఆర్‌సీ ప్రకారమే జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ట్రెజరీ విభాగం.. ఉద్యోగుల జీతాలను ప్రాసెస్ చేసింది. రేపు మంగళవారం ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు వచ్చిన తర్వాత.. జీతాలు పెరిగాయా..? లేదా..? అనేది తెలియనుంది.
Also Read : ఆదివారం కూడా విధుల్లో ట్రెజరీ ఉద్యోగులు.. జీతాలు క్లియర్ చేయడంలో బిజీబిజీ!