Idream media
Idream media
ఇటీవల అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ప్రకటించిన దేశంలోని రాజకీయ పార్టీల ఆస్తులను గమనిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆస్తులు భారీ సంఖ్యలో పెరిగితే.. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఆస్తుల లెక్కల్లో రెండోస్థానంలో కూడా లేదు. రూ.698.33 కోట్ల ఆస్తులతో బీఎస్‌పీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఆస్తుల విలువ రూ.588.16 కోట్లు. రూ.4,847.78 కోట్లతో బీజేపీ ప్రథమ స్థానంలో నిలిచింది.
మిగిలిన వాటిలో ఏ పార్టీకెన్నంటే..
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కు రూ.569.51 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.247.78 కోట్లు, సీపీఐకి రూ.29.78 కోట్లు, ఎన్‌సీపీకి రూ.8.2 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల్లో రూ.563.47 కోట్ల విలువైన ఆస్తులతో సమాజ్‌వాది పార్టీ తొలి స్థానంలో ఉండగా.. రూ.301.47 కోట్లతో టీఆర్‌ఎస్ రెండో స్థానం నిలిచింది. ఆ తర్వాత 267.61 కోట్లతో అన్నాడీఎంకే మూడో స్థానంలో, రూ.188.19 కోట్లతో టీడీపీ నాలుగో స్థానంలో, రూ.185.9 కోట్లతో శివసేన ఐదో స్థానంలో ఉన్నాయి. రూ.143.6 కోట్ల విలువైన ఆస్తులతో వైసీపీ ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ప్రాంతీయ పార్టీల అప్పుల్లో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానంలో నిలిచింది. దానికి అత్యధికంగా రూ.30.34 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో బ్యాంకు రుణాలే రూ.27.26 కోట్లు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల పార్టీల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని పాలక వైసీపీ ఆస్తుల్లో రూ.135 కోట్లు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇతర ఆస్తులు రూ.7.56 కోట్లు, అప్పులు రూ. 29 లక్షలు ఉన్నాయి. టీడీపీకి రూ.188.19 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో రూ.86.97 కోట్లు, ఫిక్స్‌డ్ ఆస్తుల రూపంలో రూ.79.74 కోట్లు, ఇతర ఆస్తులు రూ.8.17 కోట్లు. రుణాలు, అడ్వాన్సులు రూ.13.31 కోట్లు ఉన్నాయి. ఆ పార్టీకి రూ.30.34 కోట్ల అప్పులు ఉన్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు రూ.301.41 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో బ్యాంకుల్లో ఎఫ్‌డీల రూపంలో రూ.256.01 కోట్లు, ఫిక్స్‌డ్ ఆస్తుల రూపంలో రూ. 1.27 కోట్లు, ఇతర ఆస్తులు రూ.21.68 కోట్లు. రుణాలు, అడ్వాన్సులు రూ.40 లక్షలు. ఆ పార్టీకి రూ.4.41 కోట్ల అప్పులు ఉన్నాయి.
Also Read : పద్మ పురస్కారాలు ఎందరు తిరస్కరించారో తెలుసా?